Q1 Results: అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసిక ఫలితాలను నేడు విడుదల చేసింది. ఈ క్రమంలో లాభాలు భారీగా క్షీణించటంతో అంచనాలను కంపెనీ తలకిందులు చేసింది.
మెుదటి త్రైమాసికంలో కంపెనీ లాభం ఏడాది ప్రాతపధికన 46.5 శాతం క్షీణించి రూ.173.4 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.323.8 కోట్లుగా ఉంది. బ్రోకరేజ్ సంస్థలు త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.177.6 కోట్లుగా అంచనా వేశాయి. అయితే హాస్పిటల్ చైన్ దీనిని సైతం అందుకోవటంలో విఫలమైంది.

అయితే జూన్ త్రైమాసికంలో ఆదాయం 16.4 శాతం పెరిగి రూ.4,417.8 కోట్లకు చేరుకుంది. EBITDA బేస్ పీరియడ్‌లో రూ.490.7 కోట్ల నుంచి రూ.509.1 కోట్లుగా నమోదైంది. జూన్‌తో ముగిసే త్రైమాసికంలో EBITDA మార్జిన్లు 11.5 శాతంగా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే కాలంలో లాభాల మార్జిన్ 12.9 శాతంగా ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది.
FY24 మెుదటి క్వార్టర్‌లో తాము ఆరోగ్యకరమైన వృద్ధిని, పనితీరును చూశామని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి ప్రకటించారు. తాము వైద్యుల నైపుణ్యాన్ని పెంపొందించటం, చురుకైన ఆరోగ్య సంరక్షణ, అందరికీ అందుబాటులో ఉండేలా కంపెనీ నడుస్తోందని అన్నారు. ఆరోగ్య సంరక్షణ సేవల విభాగం యొక్క ఏకీకృత ఆదాయాలు నివేదించబడిన త్రైమాసికంలో 13 శాతం పెరిగినట్లు వెల్లడించింది.
అపోలో హెల్త్‌కో లిమిటెడ్ కింద ఉన్న ఫార్మసీ పంపిణీ వ్యాపారం తొలి త్రైమాసికంలో రూ.82.6 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసినట్లు అపోలో తన ఆర్థిక ఫలితాల్లో వెల్లడించింది. ఇదే క్రమంలో అపోలో హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ విభాగం రూ.14.7 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయంలో కంపెనీ షేర్లు స్వల్పంగా నష్టపోయి రూ.4,906.15 వద్ద ఎన్ఎస్ఈలో ట్రేడింగ్ ముగించాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications