Multibagger Stock: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి మిలియనీర్లు కావాలని చాలా మంది ఆశపడుతుంటారు. అయితే పెట్టుబడికి సరైన సమయం ఇచ్చి ఉత్తమమైన కంపెనీల్లో డబ్బు ఇన్వెస్ట్ చేస్తే ఫలితాలు తప్పకుండా ఉంటాయని మార్కెట్ అనేక సార్లు నిరూపించింది. ఈ స్టాక్ కూడా తన ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించింది.

కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది ఆరోగ్య రంగానికి చెందిన అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ స్టాక్ గురించి. ఇది తన వాటాదారులకు 32,302% పైగా రాబడిని అందించింది. ఈ కంపెనీ దేశంలో ప్రముఖ హాస్పిటల్ చైన్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. దేశంలో దీనికి అనేక రాష్ట్రాల్లోని నగరాల్లో ఆసుపత్రులు ఉన్నాయి.

అపోలో హాస్పిటల్స్ షేర్ ధర హిస్టరీ..
NSEలో శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌లో అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ లిమిటెడ్ షేరు రూ.4,124.90 వద్ద ముగిసింది. జనవరి 1, 1999న స్టాక్ ధర కేవలం రూ.12.73 మాత్రమే. అంటే 23 సంవత్సరాల్లో స్టాక్ దాని ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. దీని ప్రకారం.. 23 ఏళ్ల కిందట లక్ష రూపాయలను దీర్ఘకాలం పెట్టుబడి పెట్టిన వ్యక్తి.. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం రూ.3.24 కోట్లు పొందేవాడు.

రాబడులు ఇలా..
స్టాక్ ధర సెప్టెంబర్ 1, 2017న రూ.1090.55 నుంచి గత ఐదేళ్ల స్థాయికి పెరిగింది. అంటే.. షేరు 278.24% మల్టీబ్యాగర్ రాబడిని అందించింది. స్టాక్ 2022లో ఇప్పటివరకు 17.34% పడిపోయింది. ఎన్‌ఎస్‌ఈలో స్టాక్ 52 వారాల గరిష్ఠ స్థాయి రూ.5,935.40గా ఉంది. ఇదే సమయంలో స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.3,361.55గా ఉంది.

కంపెనీ వ్యాపారం..
కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.59,481.56 కోట్లుగా ఉంది. అపోలో హాస్పిటల్స్ ఆసియాలో ప్రముఖ ఆరోగ్య వ్యాపార సంస్థగా ఉంది. ఇది ఆసుపత్రులు, ఫార్మసీలు, ప్రైమరీ కేర్ అండ్ డయాగ్నోస్టిక్ క్లినిక్‌లు, బహుళ రిటైల్ హెల్త్ మోడల్‌లతో సహా సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ ప్రధానమైనది. ప్రస్తుతం కంపెనీకి 73 ఆసుపత్రులు, 4500+ ఫార్మసీలు, 300 పైగా క్లినిక్‌లు, 1100 డయాగ్నస్టిక్ సెంటర్లు, 200 టెలిమెడిసిన్ యూనిట్లలో 10,000 పడకలను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications