భారతదేశంలోనే అతిపెద్ద హెల్త్‌కేర్ నెట్‌వర్క్ అయిన అపోలో హాస్పిటల్స్ (Apollo Hospitals) లో జరుగుతున్న మార్పులు ఇప్పుడు కార్పొరేట్ రంగంలో చర్చనీయాంశంగా మారాయి. అపోలో తన ఫార్మసీ, డిజిటల్ హెల్త్ విభాగాలను విడదీసి (Demerger), విడిగా లిస్ట్ చేయాలని తీసుకున్న నిర్ణయంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ సునీత రెడ్డి ఈ మార్పుల వెనుక ఉన్న అసలు కారణాలను వివరిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఇది ఫ్యామిలీ లెన్స్ కాదు.. బిజినెస్ స్ట్రాటజీ!
చాలామంది ఈ పునర్వ్యవస్థీకరణను కుటుంబ ఆస్తుల పంపిణీగా భావిస్తున్నారు. కానీ, సునీత రెడ్డి ఈ వాదనను పూర్తిగా తోసిపుచ్చారు. "మేము తీసుకునే ప్రతి నిర్ణయం షేర్ హోల్డర్ల ప్రయోజనం కోసమే. మా మధ్య ఎలాంటి కుటుంబ విబేధాలు లేవు. నేను నా సోదరి శోభన కామినేనితో నిత్యం మాట్లాడుతుంటాను. మేము కలిసి పని చేస్తున్నాం" అని ఆమె స్పష్టం చేశారు. హాస్పిటల్ బిజినెస్, అపోలో 24/7 డిజిటల్ బిజినెస్ ల పనితీరు, లాభాల లెక్కలు వేరువేరుగా ఉంటాయని, అందుకే వాటిని విడదీయడం ద్వారా కంపెనీ వృద్ధి మరింత వేగంగా ఉంటుందని ఆమె వివరించారు.
వారసత్వానికి మెంటార్‌షిప్..
అపోలో గ్రూప్ తదుపరి తరం నాయకత్వానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా మనందరికీ తెలిసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల (Upasana Kamineni) అపోలో ఛారిటీస్, హెల్త్‌కేర్ విభాగాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సునీత రెడ్డి దీని గురించి ప్రస్తావిస్తూ, "తర్వాతి తరం నాయకులు ఇప్పటికే వ్యాపారంలో తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. వారికోసం ప్రత్యేక మెంటార్‌షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వారసత్వ మార్పు సజావుగా సాగేలా మేము జాగ్రత్తలు తీసుకుంటున్నాము" అని పేర్కొన్నారు. మెగా కోడలిగా ఉపాసన సామాజిక సేవా కార్యక్రమాల్లో, అపోలో ఫౌండేషన్‌లో చురుగ్గా పాల్గొంటూ తనదైన ముద్ర వేస్తున్న సంగతి తెలిసిందే.
భవిష్యత్తు లక్ష్యం: ప్రివెంటివ్ హెల్త్‌కేర్!
ప్రివెంటివ్ హెల్త్ కేర్ తమ తర్వాతి లక్ష్యం అని ఈ సందర్భంగా సునీత రెడ్డి వివరించారు. భారతదేశంలో క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులు పెరుగుతున్న తరుణంలో, అపోలో గ్రూప్ తన దృష్టిని 'ప్రివెంటివ్ హెల్త్‌కేర్' (వ్యాధి రాకుండా ముందే అడ్డుకోవడం) వైపు మళ్ళించింది. రానున్న ఐదేళ్లలో మెట్రో నగరాలతో పాటు టైర్-2 నగరాల్లో కూడా హాస్పిటల్ నెట్‌వర్క్ ను విస్తరించనున్నట్లు సునీత రెడ్డి తెలిపారు. ఏఐ (AI), టెలిమెడిసిన్ వంటి సాంకేతికతలను ఉపయోగించి అత్యుత్తమ వైద్య సేవలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడమే అపోలో లక్ష్యమని ఆమె వివరించారు.
మొత్తంగా చూస్తే.. అపోలో హెల్త్‌కో (Apollo HealthCo) 2027 నాటికి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణ, సాంకేతికతకు పెద్దపీట వేయడం అలాగే తర్వాతి తరం నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా అపోలో గ్రూప్ తన ఆధిపత్యాన్ని కొనసాగించే దిశగా అడుగులు వేస్తోంది. ఒక పక్క కుటుంబ విలువలని కాపాడుకుంటూనే, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కార్పొరేట్ గవర్నెన్స్ ను పాటించడం అపోలో ప్రత్యేకత.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications