Women share: కరోనా అనంతరం జాబ్ మార్కెట్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రపంచ వ్యాప్తంగా అలుముకున్న ఆర్థిక మందగమనం నేపథ్యంలో.. ఉద్యోగాల్లో అనిస్థితి ఏర్పడింది. ఓ పక్కన క్లయింట్లు ఖర్చులు తగ్గించుకోవడంతో కంపెనీలు సతమతమవుతుండగా.. ఆ ప్రభావం కాస్త సిబ్బందిపై పడింది. వరుస లేఆఫ్స్‌తో ఉద్యోగులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ సమయంలో అప్నా విడుదల చేసిన నివేదిక మహిళలను కొంత ఊరటనిస్తోంది.
ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ ఫారమ్ 'అప్నా' జాబ్ మార్కెట్లో మహిళల భాగస్వామ్యం గురించి కీలక రిపోర్టు రిలీజ్ చేసింది. 56 మిలియన్ల ఉద్యోగ దరఖాస్తులను పరిశీలిస్తే వారు బలమైన ప్రభావం చూపుతున్నట్లు ప్రకటించింది. బ్లూ, గ్రే మరియు వైట్ కాలర్ రంగాల్లోని 2.1 లక్షలు SMBలు మరియు 400 ఎంటర్ప్రైజెస్ కు సంబంధించిన ఈ ఉద్యోగాలకు 33 శాతం మంది మహిళలు అప్లై చేసినట్లు వెల్లడించింది.

ఈ ఏడాది మహిళా ఉద్యోగుల వేతనాల్లో సరాసరి 25 శాతం వృద్ధి నమోదు కాగా.. 17 శాతంగా ఉన్న పురుషులను అధిగమించినట్లు తెలిపింది. మహిళా భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు ఇంకా ప్రయత్నాలు జరగాలని అభిప్రాయపడింది. అక్టోబర్లో విడుదలైన పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్ట్ ప్రకారం.. ఇండియాలో మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు 37 శాతానికి పెరిగింది. 2022లో ఇది 32.8 శాతం కాగా 2021లో 32.5 శాతం మాత్రమేనని స్పష్టం చేసింది.
ఆర్థిక వ్యవస్థలో మారుతున్న పరిస్థితులు, ప్రీమియన్ వాల్యూ సంస్థల డైవర్సిటీ విధానాల ద్వారా వర్క్ ఫోర్స్ లో మహిళల భాగస్వామ్యం పెరుగుతున్నట్లు CIEL HR సర్వీసెస్ MD మరియు CEO ఆదిత్య నారాయణ మిశ్రా అభిప్రాయపడ్డారు. IT, ఆర్థిక సేవలు, సప్లై చైన్, లాజిస్టిక్ విభాగాలు ఈ విధానం ద్వారా మంచి పురోగతి సాధిస్తున్నట్లు చెప్పారు. మరో పదేళ్లలో మేనేజ్మెంట్ లోని టాప్ లెవల్స్‌లో మహిళల భాగస్వామ్యం మరింత పెరిగవచ్చని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications