Penny stock: లక్షను రూ.67 లక్షలుగా మార్చిన పెన్నీస్టాక్.. అమాంతం పెరిగిన లాభాలు..

Multibagger stock: ప్రస్తుతం పెన్నీ స్టాక్స్ గా ప్రస్థానాన్ని ప్రారంభించిన అనేక కంపెనీలు మార్కెట్ ఒడిదొడుకుల్లోనూ మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తున్నాయి. పదుల్లో పెట్టుబడి పెట్టిన వారికి ఏకంగా వేలల్లోకి మారి లాభాలను అందిస్తున్నాయి. ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్న స్టాక్ కూడా ఇన్వెస్టర్లకు ఊహించని రాబడులను అందించాయి.

కంపెనీ గురించి..

కంపెనీ గురించి..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది APL అపోలో ట్యూబ్స్ లిమిటెడ్ స్టాక్ గురించే. ఈ కంపెనీ ఇనుము, ఉక్కు ఉత్పత్తులను తయారీ వ్యాపారంలో గత కొన్నేళ్లుగా మంచి రాబడిని అందించింది.

పదేళ్ల కాలంలో ఈ స్టాక్ ధర రూ.15 నుంచి రూ.1,000 మార్క్ ను దాటింది. ఈ క్రమంలో దాదాపు 6000 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించింది. కంపెనీ షేర్ ఈ రోజు మధ్యాహ్నం కొంత నష్టపోవటంతో దాదాపు రూ.1,037 వద్ద ట్రేడ్ అవుతోంది.

లక్ష ఇన్వెస్ట్ చేసినవారికి..

లక్ష ఇన్వెస్ట్ చేసినవారికి..

APL అపోలో ట్యూబ్స్ షేర్లు ఆగస్టు 03, 2012న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లో రూ .15.31 స్థాయిలో ఉన్నాయి. కంపెనీ షేర్లు ఆగస్టు 04, 2022న BSEలో రూ.1052.75 వద్ద ట్రేడవుతున్నాయి. ఒక ఇన్వెస్టర్ 10 సంవత్సరాల క్రితం కంపెనీ షేర్లలో రూ. లక్ష పెట్టుబని ఇప్పటి వరకు కొనసాగించినట్లయితే.. ప్రస్తుతం వారికి రూ.67 లక్షల కంటే ఎక్కువ రాబడి వచ్చి ఉండేది.

5 సంవత్సరాల్లో రాబడి ఇలా..

5 సంవత్సరాల్లో రాబడి ఇలా..

APL అపోలో ట్యూబ్స్ లిమిటెడ్ షేర్లు గత 5 సంవత్సరాల్లో దాదాపు 560 శాతం రాబడిని అందించింది. 5 ఏళ్ల క్రితం ఆగస్టు 04, 2017న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కంపెనీ షేర్లు రూ. 157.69 స్థాయిలో ఉన్నాయి. ఆగస్టు 4న బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు రూ.1052.75 వద్ద ట్రేడ్ అయ్యాయి. APL అపోలో ట్యూబ్స్ షేర్లు గత నెలలో పెట్టుబడిదారులకు 23% పైగా రాబడిని అందించింది.

బలమైన లాభాలు..

బలమైన లాభాలు..

జూన్ 2022 క్వార్టర్ లో కంపెనీ రూ.59.39 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏప్రిల్-జూన్ 2022 త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.2,407.01 కోట్లకు చేరుకుంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1,113.65 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.742.50గా ఉంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+