IPO News: రేపు ప్రారంభమౌతున్న ఐపీవో.. గ్రేమార్కెట్ ప్రీమియం సూపర్.. మిస్ కాకండి..

Apeejay Surrendra IPO: కొత్త వారంలో కొత్త ఐపీవోలు తమ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు కంపెనీలు క్రూ కడుతున్నాయి. ఈ క్రమంలో వస్తున్న ఐపీవో ప్రస్తుతం గ్రేమార్కెట్లో మంచి పనితీరును కనబరుస్తోంది.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది అపీజే సురేంద్ర పార్క్ కంపెనీ ఐపీవో గురించే. ఫిబ్రవరి 5న నుంచి 7 వరకు రిటైల్ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడుతోంది. మెయిన్ కేటగిరీలో వస్తున్న ఐపీవోకు కంపెనీ షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.147 నుంచి రూ.155గా నిర్ణయించింది. ఈ ఐపీవో కోసం కంపెనీ ఇష్యూ లాట్ పరిమాణాన్ని 96 షేర్లుగా నిర్ణయించింది.

Apeejay Surrendra Park IPO trending in grey market that opening on Feb 5th, 2024

ఎవరైనా రిటైల్ ఇన్వెస్టర్ ఐపీవోలో పెట్టుబడి పెట్టాలంటే కనీసం రూ.14,880 అవసరం. అయితే ఐపీవో యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఫిబ్రవరి 2న ప్రారంభించబడింది. ఇప్పటికే కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా కంపెనీ రూ.409.50 కోట్లు సమీకరించింది. యాంకర్ ఇన్వెస్టర్లకు జారీ చేసిన 50 శాతం షేర్ల లాక్-ఇన్ వ్యవధి 30 రోజులు మాత్రమేనని గమనించాలి. ఇన్వెస్టర్స్ గెయిన్ నివేదిక ప్రకారం.. గ్రే మార్కెట్‌లో అపీజే సురేంద్ర పార్క్ ఐపీవో పనితీరు అద్భుతంగా ఉంది. ప్రస్తుత డేటా ప్రకారం గ్రే మార్కెట్‌లో కంపెనీ షేర్లు రూ.65 ప్రీమియంతో ట్రేడవుతున్నాయి.

లిస్టింగ్ వరకు ప్రస్తుతం ఐపీవోలో ఉన్న ట్రెండ్ కొనసాగితే.. స్టాక్ మార్కెట్‌లోని పెట్టుబడిదారులకు మొదటి రోజునే కంపెనీ 42 శాతం రాబడిని ఇవ్వొచ్చని తెలుస్తోంది. స్టాక్ మార్కెట్‌లో కంపెనీని రూ.200 పైన రేటుకు లిస్టింగ్ కావొచ్చని తెలుస్తోంది. కంపెనీ తాజా ఐపీవో నుంచి మెుత్తంగా రూ.920 కోట్లను సమీకరించాలని నిర్ణయించగా.. ఇందులో రూ.600 కోట్లు విలువైన తాజా షేర్లను ఇష్యూ చేసింది. మిగిలిన రూ.320 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో షేర్ల జారీ ద్వారా సమీకరిస్తోంది.

కంపెనీ వ్యాపారం:అపీజయ్ సురేంద్ర పార్క్ హోటల్ వ్యాపారంలో కొనసాగుతోంది. సంస్థ 80 రెస్టారెంట్లు, నైట్ క్లబ్‌లు, బార్‌లకు కూడా సేవలను అందిస్తోంది. ప్రస్తుతం కంపెనీకి దిల్లీ, గోవా, జైపూర్, ముంబై, జోధ్‌పూర్ సహా అనేక ప్రధాన నగరాల్లో 27 హోటళ్లు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+