IPO Listing: ఈవారం స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు అనేక ఐపీవోలు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో నేడు వచ్చిన ఐపీవో తొలిరోజే పెట్టుబడిదారులకు సూపర్ లాభాలను అందించాయి.
ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది అపీజే సురేంద్ర పార్క్ ఐపీవో లిస్టింగ్ గురించే. నేడు ఎక్స్ఛేంజీల్లోకి అడుగుపెట్టిన కంపెనీ పెట్టుబడిదారులకు ప్రీమియం రాబడులను అందించింది. దీంతో బంపర్ లిస్టింగ్ నమోదైంది. ఈ క్రమంలో కంపెనీ షేర్లు బీఎస్ఈలో రూ.187 రేటు వద్ద 20.65% ప్రీమియం రేటుకు జాబితా చేయబడ్డాయి. ఇదే క్రమంలో కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో కూడా జాబితా చేయబడ్డాయి. అయితే ఈ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. అద్భుతమైన లిస్టింగ్ తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరగటంతో లాభాలు కొన్ని నిమిషాల్లోనే 7 శాతానికి పడిపోయాయి.

ఇదే క్రమంలో కంపెనీ ఒక్కో షేరు ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ధర రూ.147 నుంచి రూ.155గా ఉంచింది. ఇదే క్రమంలో రిటైల్ పెట్టుబడిదారులు పందెం వేసేందుకు లాట్ పరిమాణాన్ని 96 షేర్లుగా నిర్ణయించింది. అంటే ఎవరైనా పెట్టుబడిదారుడు దీని కింద కనీసం రూ.14,880 పెట్టుబడిగా పెట్టారు. ఇదే క్రమంలో కంపెనీ తన ఉద్యోగులకు షేర్లను ఒక్కో దానిపై రూ.7 తగ్గింపు రేటుకు విక్రయించింది. తాజా ఐపీవో నుంచి కంపెనీ రూ.920 కోట్లను సమీకరించింది. ఇందులో రూ.600 కోట్లు తాజా ఇష్యు ఉండగా మిగిలిన రూ.320 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ కింద ఉంది.
పెట్టుబడిదారుల కోసం ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు తెరచి ఉంది. మూడు రోజుల్లో ఐపీవో 70 కంటే ఎక్కువ సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. రిటైల్ కేటగిరీ 32 సార్లు, క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కేటగిరీ 79.29 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. గ్రేమార్కెట్లో ముందు నుంచే పెట్టుబడిదారులు ఊహించినట్లుగా ప్రీమియం ధరకు లిస్టింగ్ నమోదైంది.


Click it and Unblock the Notifications