Multibagger Stock: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ గా ఉండటం పెద్ద సవాలుతో ఉన్న అంశం. రోజూ జరిగే వార్తలు, అంశాలను తప్పకుండా ఫాలో అవుతూ ఉండాల్సి ఉంటుంది. అందుకే లాభాలు ఎవరికీ ఊరికే రావని గుర్తుంచుకోవాలి.
ఈరోజు మనం దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లను కోటీశ్వరులుగా మార్చిన మల్టీబ్యాగర్ స్టాక్ గురించి తెలుసుకోబోతున్నాం. ఎలక్ట్రికల్ పరికరాల వ్యాపారంలో కొనసాగుతున్న కంపెనీ అపార్ ఇండస్ట్రీస్. గత కొన్ని సంవత్సరాలుగా కంపెనీ తన ఇన్వెస్టర్ల సంపదను పెంచుతూనే ఉంది. ఈ క్రమంలో దాదాపు 10,000 శాతానికి పైగా రాబడిని అందించింది. లక్ష పెట్టుబడిని కోటి రూపాయలుగా మార్చేసింది.

జూలై 9, 2004లో అపార్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్ ధర బీఎస్ఈలో రూ.35.25గా ఉంది. అప్పట్లో ఈ కంపెనీ షేర్లలో ఎవరైనా ఇన్వెస్టర్ లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే దాని విలువ ప్రస్తుతం రూ.కోటికి చేరుకుని ఉండేది. ప్రస్తుతం మార్కెట్లో స్టాక్ ధర రూ.3,577గా ఉంది. ఈ రోజు స్టాక్ తన కొత్త 52 వారాల గరిష్ఠ ధర రూ.3,610ను ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో తాకింది. అలాగే అపార్ ఇండస్ట్రీస్ షేర్ 52 వారాల కనిష్ఠ ధరను పరిశీలిస్తే రూ.906.20 వద్ద ఉంది.
గడచిన మూడేళ్ల కాలంలో అపార్ ఇండస్ట్రీస్ షేర్లు 1100 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించాయి. అక్టోబర్ 16, 2020న బీఎస్ఈలో కంపెనీ షేర్ ధర రూ.284.30 వద్ద ట్రేడవుతోంది. అలాగే అపార్ ఇండస్ట్రీస్ షేర్లు గత ఏడాది కాలంలో దాదాపు 277% రాబడిని అందించాయి. అలాగే చివరి ఆరు నెలల కాలంలో స్టాక్ 99 శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చింది. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఒక్కో షేరుపై రూ.40 చొప్పున డివిడెండ్ చెల్లించింది.

అపార్ ఇండస్ట్రీస్ కండక్టర్లు, వివిధ రకాల కేబుల్స్, స్పెషాలిటీ ఆయిల్స్, పాలిమర్స్, లూబ్రికెంట్ల తయారీ సరఫరాలో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. కంపెనీ విభాగాల్లో కండక్టర్, ట్రాన్స్‌ఫార్మర్ & స్పెషాలిటీస్ ఆయిల్స్, పవర్/టెలికాం కేబుల్స్ ఉన్నాయి. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ అమ్మకాలు గత ఏడాదితో పోల్చితే 35.4% పెరిగి రూ. 4,056.53 కోట్లకు చేరుకున్నాయి. దీంతో నికర లాభం నాలుగో త్రైమాసికంలో 194% పెరిగి రూ.242.73 కోట్లకు చేరుకుంది.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market: ఇన్వెస్టర్ల కొంప ముంచిన మార్కెట్! ఒక్కరోజే రూ. 8 లక్షల కోట్లు ఆవిరి.. కారణాలివే!

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications