Multibagger Stock: ఏడాదిలో పెట్టుబడిపై నాలుగింతల రాబడి.. రాకెట్ స్టాక్ మీరూ కొన్నారా..?

Multibagger Stock: స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బులు సంపాదించటం మాటలు చెప్పుకున్నంత సులువు కాదు బాస్. దానికి చాలా టెక్నికల్, ఫండమెంటల్ ఎనలెటికల్ స్కిల్స్ అవసరం. వీటన్నింటికి తోడు సరైన సమయంలో నిర్ణయాలు తీసుకునే డెసిషన్ మేకింగ్ చాలా అవసరం. అలా ఓపికగా ఉన్న వారినే లాభాలు వరిస్తాయని విజయవంతమైన ట్రేడర్లు చెబుతుంటారు.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది అపార్ ఇండస్ట్రీస్ షేర్ గురించే. స్టాక్ మార్కెట్లు భారీ హెచ్చుతగ్గుల్లో కొనసాగుతున్న సమయంలో కూడా ఈ స్టాక్ మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు విపరీతమైన లాభాలను ఇచ్చింది. ఎన్ఎస్ఈలో సంవత్సరం కిందట రూ.659గా ఉన్న స్టాక్ నాలుగింతలు పెరిగి కనకవర్షం కురిపించింది.

Apar Industries Ltd stock gave multibagger returns in just one year to investors

అపార్ ఇండస్ట్రీస్ స్టాక్ ఈరోజు 11.35 గంటల సమయంలో మార్కెట్లో రూ.2,8245.30 వద్ద ట్రేడవుతోంది. ఈ క్రమంలో మార్కెట్ క్యాప్ రూ.రూ.10,777 కోట్లకు పైగా ఉంది. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.556.25 వద్ద ఉండగా.. 52 వారాల గరిష్ఠ ధర రూ.2,885గా ఉంది. ఏడాది కిందటం కంపెనీలో ఎవరైనా ఇన్వెస్టర్ రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే వారు రూ.4 లక్షల కంటే ఎక్కువ రాబడిని కలిగి ఉంటుంది. త 6 నెలల్లో ఈ స్టాక్ సుమారు 87 శాతం జంప్ చేసింది. గత నెలలో ఈ షేరు 12 శాతం లాభపడింది.

ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా కండక్టర్లను తయారు చేసే సంస్థల్లో ప్రముఖమైనదిగా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ట్రాన్స్‌ఫార్మర్ ఆయిల్ తయారీలో ఇది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద సంస్థగా కొనసాగుతోంది. అలాగే పునరుత్పాదక కేబుల్స్ తయారు చేసే భారతదేశంలో అతిపెద్ద కంపెనీగా ఉంది. కంపెనీ పాలిమర్స్, లూబ్రికెంట్ల వ్యాపారంలో కొనసాగుతోంది.

Note: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అయితే వీటి ఆధారంగా ఎలాంటి ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు తప్పనిసరిగా మీ ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+