Super Six Schemes: గడచిన సార్వత్రిక ఎన్నికల్లో పోటాపోటీగా జరిగిన సమరంలో విజయం సాధించేందుకు అటు వైసీపీ, ఇటు కూటమి ప్రభుత్వం తీవ్రంగా శ్రమించాయి. ఈ క్రమంలో ప్రజలు కూటమి మ్యానిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల వైపు మెుగ్గుచూపిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల తర్వాత మధ్యంతర బడ్జెట్లతో సాగిన ప్రభుత్వం నేడు తొలిసారిగా పూర్తి స్థాయి వార్షిక్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి సిద్ధం అయ్యింది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ నేటి బడ్జెట్లో మెుత్తం పద్దును రూ.3.24 లక్షల కోట్లుగా ఉంచుతారనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అసలు ఎన్నికల సమయంలో కూటమి ప్రకటించిన బూబు సూపర్ సిక్స్ స్కీమ్స్ పైనే అందరి దృష్టి కొనసాగుతోంది. ఏడాది కావొస్తున్నా వీటిలో ఎక్కువ పథకాలు అమలులోకి రాకపోవటంపై ప్రజలతో పాటు ప్రతిపక్షాల నుంచి కూడా కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.

సూపర్ సిక్స్ స్కీమ్స్ లిస్ట్..
- యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి
- స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం
- రైతులకు ఏటా రూ.20,000 ఆర్థిక సాయం
- ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు
- ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం
- మహిళలకు రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ప్రస్తుత వార్షిక బడ్జెట్లో మహిళలకు నెలకు రూ.1,500 ఆర్థిక సహాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలకు ఎలాంటి కేటాయింపులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే మంత్రి లోకేష్ ప్రకటన ప్రకారం అమ్మకు వందనం, అన్నదాత సుఖీభవకు కేటాయింపులు ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకంలో పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం రూ.6000 ఏటా అందిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం హామీ ప్రకారం రూ.20000 అందించటానికి మిగిలిన రూ.14,000 చెల్లింపులకు కేటాయింపులు ఉండొచ్చు.
ఇక అమ్మకు వందనం రానున్న ఏప్రిల్-మే నెలల్లో స్టార్ట్ అవుతుందని మంత్రి లోకేష్ స్పష్టత ఇవ్వటం చూస్తుంటే ఈ స్కీమ్ కి కూడా ప్రస్తుత బడ్జెట్లో కొంత నిధుల కేటాయింపులు ఉండొచ్చని ప్రజలు ఆసిస్తున్నారు. దీనికింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15,000 చొప్పున అందించబడుతుంది. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ల స్కీమ్ కింద పంపిణీని స్టార్ట్ చేసింది. సూపర్ సిక్స్‌లో భాగమైన అన్నా క్యాంటీన్లను తిరిగి విడతలవారీగా తిరిగి ఓపెన్ చేసింది.
మత్స్యకార సమాజానికి ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు ఉండొచ్చని తెలుస్తోంది. వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలకు రూ.20,000 ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించటంతో దీనికోసం కేటాయింపులు ఉండొచ్చు. ఇదే క్రమంలో తాగు సాగు నీటి ప్రాజెక్టులకు ప్రత్యేక కేటాయింపులు ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications