AP Liquor News: ఏపీలో లిక్కర్ కిక్కుతో చంద్రబాబు ఖజానాకు కాసులు.. జోరుగా అమ్మకాలు..
AP Liquor Sales: కొత్తగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త లిక్కర్ పాలసీని ప్రవేశపెట్టింది. అలాగే గత ప్రభుత్వ సమయంలో ఏపీ బ్రాండ్ల లిక్కర్ నాశిరకంగా ఉండటంతో మందుబాబులు ఇబ్బందిపడ్డ సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగానే ప్రస్తుతం చంద్రబాబు సర్కార్ నాణ్యమైన మద్యాన్ని, ప్రముఖ బ్రాండెడ్ లిక్కర్ అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో దాదాపు రెండు నెలల కిందట అక్టోబర్ 16న ఏపీ ప్రభుత్వం కొత్త పాలసీ కింద లిక్కర్ షాపులను తెరిచింది. ప్రస్తుతం సరసమైన ధరలకే మద్యం అందుబాటులోకి రావటంతో మందుబాబులు అధికంగా సేవిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గడచిన 55 రోజుల వ్యవధిలో ఏపీలో లిక్కర్ అమ్మకాలు రూ.4677 కోట్లుగా నమోదైన్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో డిసెంబర్ 9 వరకు 61.63 లక్షల కేసుల లిక్కర్, 19.33 లక్షల కేసుల బీర్లు అమ్ముడైనట్లు వెల్లడైంది. గత వైసీపీ ప్రభుత్వమే స్వయంగా మద్యం విక్రయాలను చేపట్టినప్పటికీ కూటమి ప్రభుత్వం మాత్రం దాదాపు 3,300 షాపులకు డ్రా పద్దతిలో అలాట్ చేసింది.

కూటమి ప్రభుత్వం లిక్కర్ దుకాణాలకు టెండర్ల రూపంలో రూ.2 వేల కోట్లు ఆదాయాన్ని సంపాదించగా.. ప్రస్తుతం పాదమద్యమే విక్రయిస్తున్నప్పటికీ షాపు యజమానులకు చెప్పిన 20 శాతం కమిషన్ కంటే తక్కువే ఇప్పటికీ చెల్లించటంపై యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్ షాపుల లైసెన్సుల కోసం భారీగా చెల్లించి, తక్కువ లాభాలను షాపులను నడపటం కొంత కష్టంగా ఉందని, ఇదే కొనసాగితే చివరికి తమకు నష్టాలే మిగులుతాయని వారు ఆందోళన చెందుతున్నారు. ఇక పోతే ఊళ్లలో మద్యం షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ప్రతి గ్రామంలోనూ 2-3 షాపుల రాకపై ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినప్పటికీ దందా నడుస్తూనే ఉంది. అధికారుల తణికీలు జరిపినా ఎలాంటి మార్పు రావటం లేదు.
మరోపక్క మందుబాబులు కూడా తమకు ఇచ్చిన హామీ మేరకు మద్యం ధరలను తగ్గించాలని కోరుతున్నారు. కొన్ని చోట్ల ఇప్పటికీ రాజకీయనాయకులు, స్థానిక అధికార నేతల నుంచి షాపు యజమానులకు తొలుత సమస్యలు ఏర్పడినప్పటికీ ప్రస్తుతం చాలా చోట్ల వారు రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో చాలా చోట్ల ఎమ్మల్యేలతో షాపుల యజమానులు వాటాలు టైంకి పంపించి తమ వ్యాపారాలను కాపాడుకుంటున్నారు.


Click it and Unblock the Notifications