AP Liquor Policy: త్వరలోనే గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీ గడువు ముగింపుకు వస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీకి శ్రీకారం చుడుతోంది. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా నాణ్యమైన లిక్కర్ బ్రాండ్లను మద్యం ప్రియులకు చేరువచేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ క్రమంలో ఏపీలో నూతన మద్యం విధానం అక్టోబర్ 1, 2024 నుంచి అమలులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇందులో కూటమి ప్రభుత్వం గీత కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని నిర్ణయించింది. వారికి 10 శాతం మద్యం దుకాణాలను అంటే దాదాపు 396 ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైందని సమాచారం. అయితే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న మద్యం పాలసీలను సైతం ఇప్పటికే పరిశీలించినప్పటికీ చివరికి 2019కి ముందు ఉన్న లిక్కర్ పాలసీని ఏపీలో తిరిగి అమలు చేస్తే బాగుంటుందని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది.

2019 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో లిక్కర్ షాపులను కేవలం ప్రభుత్వం మాత్రమే నిర్వహించేందుకు అనుకూలంగా చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చట్టానికి గుడ్ బై చెప్పేసింది. ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు తిరిగి మద్యం వ్యాపారాన్ని కట్టబెట్టాలని నిర్ణయించింది. ఇక్కడ సీఎం చంద్రబాబుకు ఉన్న పెద్ద తలనొప్పి ఏమిటంటే గత ప్రభుత్వం నియమించిన ఉద్యోగుల ఉపాధికి ప్రమాదం కలుగుతుందనే ఆందోళనలు పెరగటమే. ఈ నెల ప్రారంభంలో దీనిని నిరశిస్తూ వారు లిక్కర్ షాపుల బంద్ నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ అకాల వర్షాలతో విజయవాడ నగరం మునిగిపోవటంతో ఇది వాయిదా పడింది.
ఈ తరుణంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించాలంటూ మహిళా సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేస్తోంది. అలాగే మద్యం తాగి ఎవరైనా చనిపోతే వారి కుటుంబంలోని మహిళలకు ప్రభుత్వమే పరిహారం చెల్లించాలనే సరికొత్త డిమాండ్‌ను మహిళా సంఘాల ఐక్య వేదిక ఏపీ ప్రభుత్వం ముందు ఉంచింది. అయితే ప్రభుత్వం షాపులను నడిపే హక్కులను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వటం ద్వారా లైసెన్సు ఫీజుల రూపంలో వేల కోట్లు అదనపు ఆదాయం కూడా వస్తుందని తెలుస్తోంది.
ఇదే క్రమంలో ప్రభుత్వం దేశంలోని 6 రాష్ట్రాల్లో అమలులో ఉన్న పాలసీని, అక్కడి లిక్కర్ ధరలను పరిశీలించిన తర్వాత ఏపీలో అత్యధిక ధరలు ఉన్నట్లు గుర్తించింది. కాబట్టి రానున్న పాలసీలో సరసమైన ధరలకు నాణ్యమైన మద్యాన్ని కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలనే డిమాండ్స్ కి అనుగుణంగా మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్ ముసాయిదాను సీఎంకు సమర్పించారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహేతుకమైన ధరలకు మద్యం లభ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని వారు నొక్కి చెప్పారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications