ఏపీలోని వైజాగ్‌లో గూగుల్ డేటా సెంటర్ రాబోతుందన్ని విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే బాటలో మరికొన్ని కంపెనీలు కూడా ఏపీకి క్యూ కడుతున్నాయి. గూగుల్ తరహాలో భారీ డేటా సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాయి. ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో రిలయన్స్ సంస్థ ఏకంగా ఒక గిగా వాట్ ఏఐ డేటా సెంటర్‌ను పెట్టే దిశగా ఒప్పందాలు కుదుర్చుకుంది. దీని గురించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..

గిగా వాట్ డేటా సెంటర్
ప్రస్తుతం విశాఖపట్నంలో సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ జరుగుతోంది. ఇందులో రకరకాల కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వంతో పలు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే రిలయన్స్ సంస్థ ఏపీలో భారీ ఏఐ డేటా సెంటర్ పెట్టేందుకు ముందుకొచ్చింది. ఏపీలో ఏఐ డేటా సెంటర్తో పాటు సోలార్ పవర్ ప్లాంట్, గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటేడ్ ఫుడ్ పార్క్ వంటివి ఏర్పాటు చేస్తామని రిలయన్స్ సంస్థ ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిపిన భేటీలో ఈ విషయాలు వెల్లడించారు. ఒక గిగావాట్ సామర్థ్యంతో ఏర్పాటయ్యే ఈ డేటా సెంటర్లో అడ్వాన్స్‌డ్ జీపీయూలు, టీపీయూలు, ఏఐ ప్రాసెసర్‌లు అమర్చనున్నారు. ప్రస్తుతం గుజరాత్‌లో ఉన్న రిలయన్స్ గిగావాట్- ఏఐ డేటా సెంటర్‌కు అనుబంధంగా దీన్ని నిర్మించనున్నారు. ఈ రెండు డేటా సెంటర్లకై రిలయన్స్ సుమారు రూ. లక్ష కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్టు సమాచారం.
సోలార్ ప్లాంట్
డేటా సెంటర్ ఏర్పాటుతోపాటు ఈ సెంటర్‌కు స్థిరమైన పవర్ సప్లై ఇచ్చేందుకు గానూ 6 గిగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటుచేసేందుకు రిలయన్స్ ప్లాన్ చేస్తోంది. దీంతోపాటు కర్నూల్ లో 170 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్‌ను కూడా ఏర్పాటుచేయబోతోంది. ఇందులో డ్రింకింగ్ వాటర్ సహా పలు ఇతర ఉత్పత్తులను తయారుచేసే ఆటోమేటెడ్ సిస్టమ్స్ ఉంటాయి. ఇక్కడ వేల మందికి ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంటుంది.
లక్షల్లో ఉద్యోగాలు
ఇకపోతే ఈ సమ్మిట్‌లో ఇప్పటివరకూ ఏపీ ప్రభుత్వం 400లకు పైగా ఎంవోయూలు కుదుర్చుకుంది. సుమారు 3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఏపీకి రానున్నట్టు తెలుస్తోంది. వీటిలో బ్రూక్ ఫీల్డ్ ద్వారా సుమారు రూ. లక్ష కోట్ల పెట్టుబడి, ReNew ద్వారా రూ. 82 వేల కోట్ల పెట్టుబడి, SAEL ఇండస్ట్రీస్ ద్వారా రూ. 22 వేల కోట్ల పెట్టుబడి, HERO ఫ్యూచర్ ఎనర్జీస్ ద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వీటి ద్వారా సమారు లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications