AP Liquor: సీఎం చంద్రబాబుకు మందుబాబుల దీవెన..!! అసలు ఏమైందంటే..

AP Liquor Policy: ఏపీలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మందుబాబులకు నిజంగా మంచిరోజులు వచ్చేశాయి. ప్రస్తుతం ఏపీలో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ కింద కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా ఎదురైన సమస్య ఇప్పటికే షాపులను రన్ చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు సహాయ నిరాకరణకు దిగటమే. చాలా చోట్ల తమకు ఉద్యోగ భద్రతకు కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వాలంటూ ఉద్యోగులు షాపులు తెరవటం మానేసి నిరసనలు చేపడుతున్నారు.

ఈ సమస్యలను పరిష్కరించి లిక్కర్ ప్రియులకు మద్యం అందుబాటులో ఉండేలా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని అధికారులు మార్గాలను అన్వేషిస్తున్నారు. కొందరు షాపులు బంద్ అవ్వటాన్ని ఆసరాగా తీసుకుని అధిక ధరలకు బ్లాక్ లో విక్రయించటాన్ని అడ్డుకోవాలని ఆబ్కారీ శాఖ అధికారులు చూస్తున్నారు. అయితే ఇక్కర మద్యం ప్రియులను సంతోషానికి గురిచేస్తున్న విషయం రూ.99 రేటు నుంచే లిక్కర్ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలే. కొత్త మద్యం పాలసీ ద్వారా ప్రభుత్వానికి రూ.5,500 కోట్లు ఆదాయంగా వస్తుందని తెలుస్తోంది.

AP Liquor users in happy mood amid CM Chandrababu brought 99rs Liquor Know details

ఏపీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ కింద అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు 3736 రిటైల్ షారులకు అమ్మకాల లైసెన్స్ ఇస్తోంది. ఇవి ఈ నెల 12 నుంచి ఓపెన్ అవుతాయని తెలుస్తోంది. తక్కువ ఆదాయం ఉండే వ్యక్తులకు సైతం మంచి లిక్కర్ సరసమైన ధరలకు అందించేందుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రస్తుతం ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కొత్త పాలసీపై మద్యం కంపెనీలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. మద్యం విక్రయాల విషయంలో ఏపీ రానున్న కాలంలో మూడు అగ్ర మార్కెట్లలో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే కొత్త పాలసీ రానున్న రెండేళ్ల పాటు అమలులో ఉంటుందని తెలుస్తోంది.

గత ఐదేళ్లలో జరిగింది ఇదే..
ఇంతకు ముందు వైకాపా ప్రభుత్వ హయాంలో లోకల్ లిక్కర్ బ్రాండ్లను భారీ ధరలకు విక్రయించటంతో మద్యం అమ్మకాలు సగానికి పడిపోయాయి. ఈ క్రమంలో చాలా మంది మద్యం ప్రియులు తమకు నచ్చిన బ్రాండ్ల కోసం పక్క రాష్ట్రాలకు తరచుగా వెళ్లేవారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితులకు ఏపీ సర్కార్ చెక్ పెట్టడంతో పాటు ఏపీలోని మందుబాబులు ఆల్కహాల్ టూరిజం తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. మంచి బ్రాండెడ్ మద్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. అలాగే ఆన్ లైన్ లాటరీ విధానం ద్వారా షాపులను వేలం వేయటం పారదర్శకతను పెంచుతుందని ప్రభుత్వం చెబుతోంది.

ఈ క్రమంలో ఏపీలోని ఒక్కో బ్రూవరీకి రూ.300 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఖర్చవుతున్నందున రాష్ట్రంలో వేల కోట్ల విలువైన పెట్టుబడులపై తాజా ఆసక్తిని తాము ఆశిస్తున్నామని భారత బీర్ పరిశ్రమ సంస్థ తెలిపింది. కొత్త పాలసీ అటు మద్యం ప్రియులకు, ఇటు ప్రభుత్వానికి లిక్కర్ కంపెనీలకు భారీగా లాభాలను తెచ్చిపెట్టనుందని నిపుణులు చెబుతున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+