AP Liquor: సీఎం చంద్రబాబు కొంపముంచుతున్న లిక్కర్.. రేవంత్ రెడ్డి ప్లాన్..!!
AP Liquor Policy: ఈ ఏడాది ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరి విజయంతో ఎన్నికల్లో ఇచ్చిన లిక్కర్ ప్రామిస్ కూడా ఒకటని చెప్పుకోవాలి. తామెుస్తే మంచి మద్యం బ్రాండ్లను తిరిగి తెస్తామని చంద్రబాబు మందుబాబులకు హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఏపీ కొత్త లిక్కర్ పాలసీకి శ్రీకారం చుడుతోంది. ఇది కాస్త ప్రస్తుత ఉద్యోగుల భవిష్యత్తుపై నీలినీడలకు దారితీయటంతో వారు సెప్టెంబర్ 7 నుంచి నిరసన వ్యక్తం చేయనున్నారు. దీంతో లిక్కర్ షాపులు బంద్ కానున్నాయి.
అయితే గత వైకాపా ప్రభుత్వ హయాంలో సొంతంగా ప్రభుత్వమే బెల్టు షాపులను రన్ చేసింది. అయితే ప్రస్తుతం సీఎం చంద్రబాబు దీనికి బదులుగా ప్రైవేటు విక్రేతలకు షాపులను అప్పగించాలని చూస్తున్నారు. దీని రూపకల్పనలో ఎక్సైజ్ అధికారులు రాజస్థాన్, కేరళ, యూపీ, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల మద్యం పాలసీలను స్టడీ చేసింది. ప్రధానంగా 2019కి ముందునాటి పాలసీని తిరిగి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రిటైల్ లిక్కర్ వ్యాపారం ప్రైవేటు ఆటగాళ్ల చేతుల్లోకి తిరిగి వెళ్లనుందని తెలుస్తోంది.

అయితే ఇక్కడ గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే పాలసీలో పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రం తెలంగాణ ఫాలో అవుతున్న కొన్ని అంశాలను చేర్చనుంది. దీంతో దరఖాస్తుదారు నుంచి అనేక బిడ్డింగ్స్ స్వీకరించి, లాటరీ పద్ధతిలో లైసెన్స్‌లను కేటాయించాలని డిపార్ట్‌మెంట్ యోచిస్తోంది. ఈ క్రమంలో లైసెన్సు కోసం పాల్గొనేవారు ఒక్కో దరఖాస్తు కోసం రూ.2 లక్షలు నాన్ రిఫండబుల్ డిపాజిట్ చేయాల్సి ఉంది. తెలంగాణ మోడల్ ఆంధ్రప్రదేశ్‌కు కూడా సరిపోతుందని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. దీంతో ఏపీలో ధరలు సైతం పక్కనే ఉన్న తెలంగాణ, కర్ణాటకలతో సమానంగా ఉంటాయని, నాన్ డ్యూటీ పెయిడ్ మద్యంవిక్రయాలను అరికట్టేందుకు ఇది దోహదపడుతుందని ఎక్సైజ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
వ్యాపారం, ధరలు, మద్యంపై విధించే పన్నులపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ సమాజంలోని వివిధ వర్గాలు, వాటాదారుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెబ్‌ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. ఉత్తర్వులు వెలువడిన తర్వాత 70 శాతం మంది సెబ్ సిబ్బంది తమ హోం డిపార్ట్‌మెంట్లలోకి వెళ్లినున్నారు. మెుత్తానికి పూర్తి స్థాయిలో అధ్యయనం తర్వాత అక్టోబర్ 1, 2024 నాటికి కొత్త మద్యం పాలసీని అమలు చేయాలని అధికారులు సిద్ధమౌతున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ పాలసీ లాగా లాటరీ విధానాన్ని పాటిస్తే అదనంగా రూ.2000 కోట్లు ప్రభుత్వానికి సమకూరనున్నట్లు అంచనాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications