TCS in Vizag: ఏపీలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు నేతృత్వంలో అనేక కంపెనీలు తిరిగి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ సైతం తండ్రికి తగ్గ తనయుడని మరో సారి నిరూపించుకున్నారు. ఇన్వెస్టర్లలో భరోసా నింపుతూ లోకేష్ ఏపీ బ్రాండ్ వేగంగా ముందుకు తీసుకెళుతున్నారు.
ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో హైటెక్ సిటీ, సైబరాబాద్ అభివృద్ధి చేసిన అనుభవం నారావారి సొంతం. అయితే ప్రస్తుతం ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత ఐటీ రంగంలో వెనుకబడిన ఏపీని తిరిగి అగ్రస్థానంలో నిలిపేందుకు మంత్రి లోకేష్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పెద్ద ప్రకటన చేశారు. విశాఖపట్నంలో టాటా గ్రూప్ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు అంగీకరించినట్లు మంత్రి తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేయబడుతున్న ఈ క్యాంపస్ దాదాపు 10,000 మందికి ఉద్యోగాలను కల్పిస్తుందని లోకేష్ వెల్లడించారు.

ఈ క్రమంలో లోకేష్ కార్పొరేట్ సంస్థలు స్వేచ్ఛగా తమ వ్యాపారాలను నిర్వహిచ్చుకోవటానికి అవసరమైన సానుకూల వాతావరణాన్ని తమ ప్రభుత్వం కల్పిస్తుందని ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు అడుగులు వేసినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. ఏపీని అభివృద్ధిపదంలో వేగంగా ముందుకు నడిపించాలంటే ప్రస్తుతం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చాలా కీలకమని చెబుతూ.. వ్యాపారంలో ఏపీని దేశంలో నెం-1 రాష్ట్రంగా మార్చటానికి చేస్తున్న ప్రయత్నంలో టీసీఎస్ తన పెట్టుబడులను ప్రకటించగా ఒక ముఖ్యమైన మెలురాయిగా మంత్రి లోకేష్ పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం #TCSinVizagWith10kJobs ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. అయితే భవిష్యత్తులో టాటా గ్రూప్ ఏపీలో ఎలక్ట్రిక్ వెహికల్, ఎయిరో స్పేస్, స్టీల్, హోటల్స్, టూరిజం రంగాల్లో కూడా కొత్త పెట్టుబడులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి దేశంలోని వివిధ నగరాల్లో ఉన్న అనే చిన్న పెద్ద టెక్ కంపెనీల్లో ప్రధానంగా తెలుగు టెక్కీల పాత్ర అధికంగానే ఉందని చెప్పుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది ఈ క్రమంలో దేశంతో పాటు విదేశాల్లో సైతం ఐటీ సేవల రంగంలో ఉద్యోగాలు, వ్యాపారాలను నెలకొల్పి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది ఏపీలోని యువత అతిపెద్ద ఐటీ దిగ్గజం టీసీఎస్ రాకపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇంజనీరింగ్ చివరి ఏడాది చదువుతున్న యువత భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలపై ఆశాజనకంగా ఉన్నారు.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications