TG Bharath: ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి తర్వాత పారిశ్రామికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో మంత్రులు కొత్త ఆలోచనలతో పాటు కొత్త విధానాలతో ముందుకు సాగుతున్నారు.
ఉత్తమ ఈజ్-టు-స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(EoDB) ద్వారా ఆంధ్రప్రదేశ్ గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని చెప్పుకోదగ్గ విజయాలను సాధించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అనేది వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఏర్పాటు చేసిన ర్యాంకింగ్ సిస్టమ్.. అయితే ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఏ కంపెనీకైనా వ్యాపారం చేసే వేగం చాలా ముఖ్యమని తాను భావిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు & వాణిజ్య శాఖ మంత్రి TG భరత్ గుడ్‌రిటర్న్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. వాస్తవానికి EoDB ర్యాంకింగ్ సరళమైన, పరిశ్రమ-స్నేహపూర్వక నిబంధనలు & సముచితంగా సంరక్షించబడిన ఆస్తి హక్కుల ద్వారా నడపబడుతుంది. సీఎం చంద్రబాబు 2014-19 మధ్య అధికారంలో ఉన్న సమయంలో ఏకంగా 5 ఏళ్లలో 4 సార్లు మెుదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.

సీఎం చంద్రబాబు ఈజ్ ఆఫ్ డూయిల్ బిజినెస్ ప్రవేశపెట్టినప్పుడు హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటి హబ్‌గా అభివృద్ధి చేసినందుకు తరచుగా ఘనత పొందారు. అయితే శ్రీ సిటీలో జరిగిన వేడుకలో బాబు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(SoDB) అనే కొత్త ఆలోచనతో ముందుకు రావటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుత యుగంలో సీఎం సూచించినట్లుగా అన్నింటికంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ పరిశ్రమకైనా ముఖ్యమైనదని మంత్రి టీజీ భరత్ అన్నారు. ఇది పొరుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలతో పోటీ పడేందుకు ఆంధ్రరాష్ట్రానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.
పరిశ్రమలకు అనుకూలమైన విధానాలను ప్రోత్సహిస్తూనే వ్యాపారాల స్థాపనకు పట్టే సమయాన్ని నిర్విరామంగా వేగవంతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని భరత్ వెల్లడించారు. ఇందుకోసం పారిశ్రామిక జోన్ల స్థాపనను వేగవంతం చేయాలని తాము భావిస్తున్నట్లు, తద్వారా రాష్ట్రాన్ని ఆర్థికంగా పునరుజ్జీవింపజేయడానికి ఉపయోగించుకోని అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం ఏపీలో పెట్టుబడులు పెట్టే వ్యాపారవేత్తలు ఇకపై ఫాలోఅప్‌ను కొనసాగించాల్సిన అవసరం లేదని దీనిపై సీఎం చంద్రబాబు స్పష్టమైన మార్గనిర్థేశం చేశారన్నారు. 2019-2024 మధ్య కాలంలో మాదిరిగా ఇన్వెస్టర్లు ప్రాజెక్టులు ప్రారంభించటానికి అనుమతుల కోసం అధికారుల చుట్టూ పదేపదే తిరగాల్సిన అవసరం లేదని పారిశ్రామిక మంత్రి పేర్కొన్నారు.
దేశంలో అభివృద్ధిలో అగ్రగామి రాష్ట్రంగా సుస్థిరంగా ముందుకు సాగేందుకు ప్రభుత్వం తీసుకురానున్న పరిశ్రమ విధానం ప్రగతిశీలత దిశగా మొదటి అడుగు అవుతుందన్నారు. దీని కోసం ఇప్పటికే వివిధ అగ్రగామి రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేస్తున్నామని, తదనుగుణంగా ఒక బలమైన పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తామని భరత్ వెల్లడించారు. ఇప్పటికే గత ప్రభుత్వ సమయంలో రాష్ట్రంలో పెట్టుబడులను ఉపసంహరించుకుని వెళ్లిపోయిన సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్‌ను పునర్నిర్మించటానికి ఉన్న ఏ అవకాశాన్ని తాము వదిలే ప్రసక్తే లేదని మంత్రి అన్నారు.
ప్రాజెక్ట్ ఎంత పెద్దది లేదా చిన్నది అనే దానితో సంబంధం లేకుండా అన్ని పాలక నియమాలు, చట్టాలకు అనుగుణంగా ఉన్నంత వరకు మద్ధతు ఇస్తామన్నారు. రిలయన్స్, టాటాల నుంచి చిన్న సూక్ష్మ పరిశ్రమ ఏర్పాటు చేసేవారి వరకు అందరికీ ప్రోత్సాహం మద్ధతు ఇవ్వటంతో ట్రస్ట్ ఫ్యాక్టర్‌ని పెంచుతామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర అప్పులు దాదాపు రూ.9.74 లక్షల కోట్లకు పైగా ఉన్న వేళ పెట్టుబడులు కీలకమని అవి రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తాయని భరత్ అభిప్రాయపడ్డారు.
అనేక సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చార్ట్‌లలో అగ్రస్థానంలో రాష్ట్రం ఉన్నప్పటికీ.. మన పారిశ్రామిక ల్యాండ్‌స్కేప్‌ను నిజంగా ఎలివేట్ చేయడానికి 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'పై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. దీనిపై ఐటీ మంత్రి నారా లోకేష్ సైతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. EODB యుగం ముగిసిందని, SODB అనేది కొత్త మంత్రంతో ఏపీ ఇకపై ముందుకు సాగనుందని చెప్పారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications