Anitha on Loan Apps: దేశంలో కరోనా మహమ్మారి ప్రజల జీవితాల్లో పెద్ద మార్పులు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనేక మంది ఆర్థికంగా చితికిపోయారు. ఆరోగ్య అవసరాలతో పాటు అనేక చిన్నచిన్న అవసరాల కోసం డబ్బు అవసరమైన వ్యక్తులను లోన్ యాప్స్ టార్గెట్ గా చేసుకోవటంపై హోం మంత్రి వంగలపూడి అనిత ప్రస్థావించారు.
చాలా మంది నేరగాళ్లు డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఫైనాన్స్ వ్యాపారాన్ని షురూ చేశారని అనిత పేర్కొన్నారు. అలాగే కొందరు నష్టపోయిన వ్యక్తులు చిన్న అవసరాలు ఉండే వ్యక్తులను, విద్యార్థులను, చిరు ఉద్యోగులను టార్గెట్ చేసుకుని తమ లోన్ యాప్స్ ద్వారా వారికి వేలల్లో డబ్బులు ఇచ్చి లక్షల్లో తిరిగి వసూళ్లు చేస్తున్నట్లు అనిత వెల్లడించారు. కొందరు విద్యార్థులు పాకెట్ మనీకోసం లేదా ఇతర చిన్న అవసరాల కోసం ఇంట్లోవాళ్లని అడగటానికి బదులుగా ఇలాంటి అరాచకుల చేతిలో రుణాలు తీసుకుని చిక్కుకుపోతున్నారని అనిత అన్నారు. ఇలా ప్రజల వ్యక్తిగత వివరాలు, ఫోన్ నంబర్లు, వారి ఫోటోలు వంటివి డిజిటల్ గా తస్కరించి బెదిరింపులకు పాల్పడే అరాచక నకిలీ లోన్ యాప్స్ పై ఉపేక్షించేది లేదని హోం మంత్రి తేల్చి చెప్పారు. యాప్ నిర్వాహకులపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.

వెంటనే ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేకుండానే లోన్ ప్రాసెస్ చేస్తాం, క్షణాల్లో మీ ఖాతాలో డబ్బు జమ చేస్తాం అంటూ ఇలాంటి లోన్ యాప్ నిర్వహకులు ప్రజలను టార్గెట్ చేస్తున్నారని అనిత పేర్కొన్నారు. వందలు వేలు అప్పులుగా ఇచ్చి రుణాలు పొందిన తర్వాత లక్షలు వసూలు చేస్తున్నారు. మార్కెట్లో రిజర్వు బ్యాంక్ నిర్థేశించిన దానికంటే భారీగా వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నారని మంత్రి వెల్లడించారు. ప్రజలను ఈ యాప్స్ పీక్కుతింటున్నాయని, కొన్ని సందర్భాల్లో వీరి చేతిలో చిక్కుకున్న ప్రజలు ఆత్మహత్యలు సైతం చేసుకున్న ఘటనలు ఉన్నాయని ఆమె వెల్లడించారు. ప్రజలు ఇలాంటి యాప్స్ కు దూరంగా ఉండాలని, అలాగే సైబర్ నేరగాళ్ల చేతుల్లో ప్రజలు చిక్కుకుని నష్టపోకుండా అప్రమత్తంగా ఉండాలని అసెంబ్లీ సాక్షిగా చర్చించారు. అలాగే ప్రస్తుత కాలంలో ప్రజలను ఫేక్ కొరియర్ కాల్స్ ద్వారా గంజాయి లేదా ఇతర అనధికారిక వస్తువులు వచ్చాయంటూ మోసగాళ్లు బెదిరింపులకు దిగటంపై కూడా అనిత మాట్లాడారు.
దీనికి ముందు ఆగస్టులో సైతం మంత్రి అనిత ఈ మనీ యాప్స్‌తో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఆగస్టులో సైబర్ యాప్ లాంచ్ కార్యక్రమంలో సైతం ప్రజలు వేల కోట్లు నేరగాళ్ల చేతికి చిక్కి పోగొట్టుకుంటున్నారని వెల్లడించారు. అప్పటికి నాలుగు నెలల సమయంలోనే దేశంలోని ప్రజలు రూ.1,730 కోట్ల లూటీకి సైబర్ నేరగాళ్ల వల్ల గురయ్యారని అనిత వెల్లడించారు. లోన్ యాప్‌లు, హనీ ట్రాప్‌లు దేశంలో ప్రజల ప్రాణాలను తీస్తున్నాయని మంత్రి విచారం వ్యక్తం చేశారు. పెరుగుతున్న సైబర్ నేరాలను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తోందని, ప్రతి జిల్లాకు సైబర్ సెల్ ఉంటుందని ఈ సందర్భంగా వెల్లడించారు.
సైబర్ క్రైమ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పోలీసు శాఖను ఆదేశించారని హోంమంత్రి తెలిపారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్‌లను జీరో స్థాయికి తీసుకురావాలని సీఎం చంద్రబాబు కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. సైబర్ నేరాలకు విద్యార్థులు, వైద్యులు కూడా బలవుతున్నారని ప్రజలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు 1930కి ఫోన్ చేయాలని సూచించారు. ఆన్‌లైన్‌లో మనీ యాప్‌లు లేదా మరే ఇతర యాప్‌కు వ్యక్తిగత సమాచారం ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వొద్దని మంత్రి సూచించారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications