ఐటీ రంగంపై వైసీపీ ప్రభుత్వం మరింత దృష్టి సారించింది. ఐటీ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఓ స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఇంజినీరింగ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఇందులో ప్రవేశం కల్పించి, వారిని మరింత అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. ఈ మేరకు ఆయన సోమవారం ఐటీ, స్కిల్ డెవలప్‌మెంట్‌పై సమీక్షించారు.

విశాఖలో హైఎండ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్
విశాఖపట్నంలో ఐటీ రంగం కోసం హైఎండ్ స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికి అనుబంధంగా మధ్య ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మరో రెండు కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఏపీ వ్యాప్తంగా మొత్తం 30 నైపుణ్య కేంద్రాలతో పాటు ఐటీ రంగం కోసం ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ ఎక్కడెక్కడ అంటే
రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రం, నాలుగు ట్రిపుల్ ఐటీలకు అనుబంధంగా మరో నాలుగు, పులివెందుల జేఎన్‌టీయూలో మరో కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల్లో పాఠ్య ప్రణాళిక, పర్యవేక్షణ, అవసరాలకు అనుగుణంగా ఎప్పటికి అప్పుడు కోర్సులను ఆధునికీకరించడం కోసం కేంద్రీకృత అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌ను ముందుగా ఏర్పాటు చేస్తారు.

హైదరాబాద్, బెంగళూరుతో పోటీ పడేలా..
హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పోటీ పడే పరిస్థితికి తీసుకు వచ్చేలా ఈ హైఎండ్ స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇప్పిస్తారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలకు సంబంధించిన నిధులు, డిజైన్లు, ప్రణాళికలు 45 రోజుల్లో పూర్తి చేసి, నిర్మాణాలు ఏడాదిలో పూర్తి చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలపై మంత్రి గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నత విద్య, ఐటీ విభాగాలకు చెందిన వారిని సభ్యులుగా నియమిస్తారు.

మరిన్ని పెట్టుబడులపై దృష్టి
సమీక్ష సందర్భంగా ఐటీ రంగంలో ఏపీకి ఉన్న అవకాశాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితుల్ని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రానున్న అయిదేళ్లలో ఐటీ రంగంలోకి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే విధంగా పాలసీ రూపకల్పనపై చర్చించారు.

పారిశ్రామిక ప్రగతికి ఊతమిచ్చేలా స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు..
రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి మంచి ఊతమిచ్చేలా ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను తీర్చిదిద్దనున్నారు. 45 రోజుల్లోగా భూముల గుర్తించి, ఆర్థిక వనరుల సమీకరణ పూర్తి చేయనున్నారు. ఏడాదిలో పూర్తి చేస్తారు. ప్రభుత్వంలో వివిధ విభాగాలు నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను అన్నింటిని స్కిల్ డెవలప్‌మెంట్ విభాగం ద్వారానే నిర్వహించనున్నారు. విద్యాశాఖ, స్కిల్ డెవలప్‌మెంట్ విభాగం కలిసి పని చేయాలని సీఎం ఆదేశించారు.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications