AP News: ఇప్పటికే ఏపీలో కియా కార్ల కంపెనీ ఉండటంతో ఆటో రంగానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థ ఏపీలో ఏర్పాటు చేయబడింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఈవీ రంగాన్ని ప్రోత్సహించటంతో అనేక కంపెనీలు ఈ కేటగిరీలో పనిచేయటానికి ముందుకొస్తున్నాయి.
ఈ క్రమంలోనే అమెరికా ఈవీ దిగ్గజం టెస్లాను రాష్ట్రానికి రప్పించటానికి చాలా కాలం నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్న సంగతి కూడా తెలిసిందే. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎంపిక తర్వాత టెస్లా ఎంట్రీ ఇండియాలోకి జరగనున్నట్లు వెల్లడైంది. ఇప్పటికే దిల్లీ, ముంబై నగరాల్లో విక్రయాలకు అవసరమైన ఉద్యోగులు, షోరూమ్స్ ఏర్పాటుకు చకచకా సన్నాహాలు కూడా జరగటంతో మరోసారి ఏపీ టెస్లాను ఆకర్షించే రేసులో చేరింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ రాష్ట్రంలో ఏర్పాటుతో ఉన్న ప్రయోజనాలను టెస్లా టీమ్ కు కన్వేచేయటం ద్వారా కొత్త పెట్టుబడిని ఆకర్షించాలని ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోంది.

ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అభివృద్ధి బోర్డు తన పోర్ట్ కనెక్టివిటీతో పాటు సమృద్ధిగా ఉన్న భూమితో భవిష్యత్ కార్ల కంపెనీని ఆకర్షించడానికి ఒక ప్రతిపాదన చేసింది. గత ఏడాది అక్టోబరులో ఐటీ మంత్రి నారా లోకేష్ తన అమెరికా పర్యటన సమయంలో టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాను కలిసిన సంగతి తెలిసిందే. అప్పుడే ఏపీలో పెట్టుబడికి ఉన్న అవకాశాలు, వనరులు, ఇతర ప్రోత్సాహకాలు, పోర్టు కనెక్టివిటీ, పవర్ లభ్యత వంటి విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం టెస్లా ప్రారంభంలో రెడీమేడ్ కార్లను దిగుమతి చేసుకుని, క్రమంగా తయారీ కేంద్రాన్ని ఏర్పాటుకు వెసులుబాటుతో ప్రత్యేక ప్రయోజనాలను అందించేందుకు ఏపీ సర్కార్ ప్రయత్నిస్తోంది.
ప్రస్తుతం ఏపీలో టెస్లా తన కార్లను దిగుమతి చేసుకునేందుకు అవసరమైన పోర్ట్ కనెక్టివిటీని కలిగి ఉంది. అలాగే దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే.. ఆటో కంపెనీలు, బ్యాటరీ తయారీదారులు, అనుబంధ తయారీదారుల రెడీమేడ్ పర్యావరణ వ్యవస్థతో సిద్ధంగా ఉండటం కంపెనీకి కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. దక్షిణ భారతంలో ఆటో అమ్మకాలు అధికంగా ఉండటంతో ఏపీలో టెస్లా తన ప్లాంట్ ఏర్పాటు చేయటం కంపెనీకి కలిసొచ్చే అంశంగా పేర్కొనబడింది.
దేశంలోని ఈవీ కార్ల అమ్మకాల డేటాను పరిశీలిస్తే.. దాదాపు 60% విద్యుత్ కార్ల అమ్మకాలు కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో జరుగుతున్నాయని వెల్లడైంది. అందుకే 2017లో కూడా చంద్రబాబు నాయుడు టెస్లాతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. రాయలసీమలో 4 మెగావాట్ల సామర్థ్యం గల రెండు సౌరశక్తి నిల్వ యూనిట్ల స్థాపనకు సాంకేతిక నైపుణ్యాన్ని విస్తరింపజేస్తామని మస్క్ అప్పట్లో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications