AP Investments: ప్రస్తుతం పెట్టుబడుల విషయంలో ఏపీ చాలా వేగంగా దూసుకుపోతోంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు మళ్లిన సీఎం చంద్రబాబు అంతే వేగంగా ఫలాలను రాష్ట్ర ప్రజలకు అందేలా చేస్తున్నారు. ప్రతినెల భారీ స్థాయిలో కొత్త ప్రాజెక్టులను ఏపీకి తీసుకురావటం కోసం కూటమి ప్రభుత్వంలోని మంత్రులు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ఈక్రమంలో వేగంగా మౌలిక వసతులతో పాటు అవసరమైన ఇతర కేటాయింపులను వారు పూర్తి చేస్తున్నారు.
దాదాపుగా వారం రోజుల కిందట డిఫెన్స్ రంగానికి చెందిన కంపెనీ భారత్ ఫోర్జ్ లిమిటెడ్ ఏపీలోని సత్యసాయి జిల్లా మడకసిరలో పెట్టుబడులు పెట్టనుందనే వార్త బయటకు వచ్చింది. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో కంపెనీ తన ఫిరంగులు, పేలుడు పదార్థాల తయారీ యూనిట్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం, ఏపీఐఐసీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా దాదాపు రూ.2,400 కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్ నెలకొల్పనున్నట్లు వెల్లడైంది. దేశ రక్షణ కోసం కంపెనీ అనేక అత్యాధునిక రక్షణ పరికరాలు, క్షిపణుల కోసం అవసరమైన పేలుడు పదార్థాల తయారీలో ప్రసిద్ధి చెందింది. తాజాగా ఏపీ ప్రభుత్వం కంపెనీకి ఇందుకోసం 1000 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. రానున్న రోజుల్లో అవసరాలకు అనుగుణంగా మరో 500 ఎకరాలను అందించటానికి సిద్ధంగా ఉన్నట్లు ఏపీ సర్కార్ ప్రకటించింది.

ఈ ఏర్పాటు వల్ల దాదాపు 550 మంది నైపుణ్యం కలిగిన, సెమీ స్కిల్డ్ కార్మికులకు ఉపాధి కల్పించబడుతుందని అంచనా వేయబడింది. కంపెనీ తన అంతర్గత పరీక్షలు, టెస్ట్ ఫైరింగ్ కోసం ఎక్కువగా భూమి అవసరం ఉంటుందని ప్రభుత్వానికి వెల్లడించటంతో ఏపీ అవసరమైన స్థలాన్ని అందించటానికి ముందుకొచ్చింది. ఫేజ్ వన్ కింద రూ.1000 కోట్లు, చివరి దశలో రూ.1500 కోట్లను ఇన్వెస్ట్ చేయాలని కంపెనీ నిర్ణయించింది. భారత్ ఫోర్జ్ అసాల్ట్ రైఫిల్, లైట్ మెషిన్ గన్, కార్బైన్ అండ్ పిస్టల్‌తో సహా అనేక రకాల చిన్న ఆయుధాలను కూడా అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఫిలిప్స్ కార్భన్ బ్లాక్ లిమిటెడ్ కంపెనీ కోసం 116.62 ఎకరాల భూమిని తాజాగా అలాట్ చేసింది. కంపెనీ రూ.3,798 కోట్ల పెట్టుబడితో తిరుపతి జిల్లా నాయుడుపేట్ ఇండస్ట్రియల్ పార్కులో ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేయటానికి ముందుకు రావటంతో అందుకు అవసరమైన స్థల కేటాయింపులను ప్రభుత్వం పూర్తి చేసింది. కంపెనీ ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ రానున్న రోజుల్లో 200 మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని తేలింది. కంపెనీ ఈ ప్లాంటులో రబ్బర్ బ్లాక్ తో పాటు వాల్యూ యాడెడ్ ఉత్పత్తులను ఇక్కడి నుంచి తయారు చేస్తోందని నిపుణులు చెప్పారు. ఇదే క్రమంలో ఏపీలో మరిన్ని పెట్టుబడులను తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ టీమ్ నిరంతరం కృషి చేస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications