AP Budget Allocations: ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మెుదటి సారి నేటు పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇదే క్రమంలో రాష్ట్రానికి వెన్నెముకలా ఉన్న వ్యవసాయ రంగానికి దాదాపు రూ.48 వేల కోట్లను కేటాయించటం జరిగింది.
తాజా బడ్జెట్లో ఏపీ ప్రభుత్వం రెవెన్యూ వ్యయాన్ని రూ.2.51 లక్షల కోట్లుగా ఉంచగా.. ఇందులో రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించింది. అలాగే మూలధన వ్యయాన్ని రూ.40.63 వేల కోట్లుగా ఉంచింది. ఇదే క్రమంలో ద్రవ్యోలోటు రూ.79,926గా అంచనా వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ఇదే క్రమంలో వివిధ రంగాలకు ప్రకటించిన మెుత్తాలను పరిశీలిస్తే.. వెనుకపడిన వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వెయ్యబడింది.

- బీసీల సంక్షేమానికి రూ.47,456 కోట్లు
- ఎస్సీల సంక్షేమానికి రూ.20,281 కోట్లు
- ఎస్టీల సంక్షేమానికి రూ.8,159 కోట్లు
- అల్పసంఖ్యాక వర్గాలకు రూ.5,434 కోట్లు
- మహిళా శిశు సంక్షేమానికి రూ.4,332 కోట్లు
- సాంఘిక సంక్షేమం రూ.10,909 కోట్లు
ఇదే క్రమంలో ఏపీ సర్కార్ నైపుణ్యాభివృద్ధికి రూ.1,228 కోట్లు, పాఠశాల విద్యకు రూ.31,805 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,506 కోట్లను కేటాయించటంతో విద్యకు అత్యధిక ప్రాధాన్యతను కూటమి ప్రభుత్వం ఇస్తున్నట్లు వెల్లడైంది. ఇదే క్రమంలో ఇతరప్రధాన కేటాయింపులను పరిశీలిస్తే..వైద్యారోగ్య శాఖకు రూ.19,260 కోట్లు, పంచాయితీ రాజ్ అండ్ రూరల్ డెవలెప్మెట్ కి రూ.18,848కోట్లు ప్రస్తుత బడ్జెట్లో దక్కాయి.
ఇదే క్రమంలో జలవనరుల అభివృద్ది శాఖకు రూ.18,020 కోట్లు, విద్యుత్ శాఖకు రూ.13,600 కోట్లు, రవాణా శాఖకు రూ.8,785 కోట్లు, మున్సిపల్ అండ్ అడర్బన్ డెవలెప్మెంట్ రూ.13,862 కోట్లను బడ్జెట్లో కేటాయించబడ్డాయి. అలాగే బడ్జెట్ కేటాయింపుల్లో సూపర్ సిక్స్ పథకాలకు తగిన ప్రాధాన్యత నిధుల కేటాయింపులు ఉంటాయని అందరూ భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications