AP News: ఇన్ఫోసిస్‍తో జతకట్టిన ఏపీ సర్కార్.. 20 లక్షల ఉద్యోగాలకు లైన్ క్లియర్..!!
Infosys News: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెంవడసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రస్తుతం అందరి చూపు ఉద్యోగాల కల్పన, ఐటీ పరిశ్రమ అభివృద్ధి వంటి అంశాలపైనే ఉంది. ఈ క్రమంలో ఏపీ సర్కార్ స్కిల్ సెన్సెస్ నిర్వహించటానికి టాప్ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌తో జతకట్టింది.
వివరాల్లోకి వెళితే దేశంలోని ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ ఇన్ఫోసిస్ ఏపీలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచటానికి అవసరమైన సాంకేతిక సహాయాన్ని అందించానికి ముందుకు వస్తోంది. ఈ క్రమంలో ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నైపుణ్య గణన కార్యక్రమాన్ని చేపట్టడానికి ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా అభ్యర్థుల నైపుణ్యాల ముందస్తు ధృవీకరణ కోసం ఇన్ఫోసిస్ ఆర్థిక వనరులతో సంబంధం లేకుండా జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను అందించడానికి ముందుకొచ్చింది.

దీనికి సంబంధించిన కీలక ఒప్పందం ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తో శుక్రవారం జరిగింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద డేటా ప్రీ-వాలిడేషన్ కోసం ఇన్ఫోసిస్ ముందుకు రావటంపై ఐటీ మంత్రి నారా లోకేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రంలోని యువత నైపుణ్యాలను అంచనా వేయటంతో పాటు మార్కెట్లో డిమాండ్ కి అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వటంలో దోహదపడుతుందని అన్నారు. డిమాండ్ ఆధారంగా యువతను స్కిల్లింగ్ చేయటం ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచటానికి సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమం ద్వారా రానున్న 5 ఏళ్లలో దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించటంలో ఇన్ఫోసిస్ భాగస్వామిగా మారుతుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ డిజిటల్ లెర్నింగ్‌లో భాగంగా విద్యార్థులను అభ్యాస మార్గాలకు కనెక్ట్ చేస్తుంది. నిరంతర అభ్యాసాన్ని సులభతరం చేయడానికి అవసరమైన ఇంటర్‌ఫేస్‌ను రూపొందిస్తుంది. ఇది యువతకు ఉచితంగా అభ్యాస అవకాశాలను అందిస్తుంది. ఇన్ఫోసిస్ ఏపీలోని 15-59 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న దాదాపు 3.59 కోట్ల మందికి ఇప్పటికే ఉన్న నైపుణ్యాలను ప్రీ-వాలిడేషన్ తర్వాత ఉచిత ఆన్‌లైన్ కోర్సులను అందజేస్తుందని తెలుస్తోంది.
ఇది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్కిల్ సెన్సస్ ఫ్రేమ్‌వర్క్, స్కిల్ అప్లికేషన్‌లో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ఏకీకృతం చేయడానికి సులభతరం చేస్తుంది. ఏపీ ప్రభుత్వానికి ఇన్ఫోసిస్ అందిస్తున్న సహకారం.. సాంకేతికతను మెరుగుపరచటంతో పాటు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను నిర్వహించడం, అలాగే పెరుగుతున్న పరిశ్రమల అవసరాలను అనుగుణంగా స్కిల్ వర్కర్ల లభ్యతను తీర్చడానికి APSDCకి సహకారంగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications