AP Liquor Rates: ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం లిక్కర్ పాలసీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారీగా దరఖాస్తులు అందాయి. ప్రధానంగా విదేశాల్లో ఉంటున్న కొందరు ఔత్సాహికులు తమ కుటుంబ సభ్యుల పేరుమీద లిక్కర్ షాపుల కోసం దరఖాస్తులు వేసినట్లు వెల్లడైంది. ఈసారి నాన్ రిఫండబుల్ డిపాజిట్ రూ.2 లక్షలు పెట్టినప్పటికీ దరఖాస్తుల జోరు కొనసాగిందని అధికారులు వెల్లడించారు.
ఈ క్రమంలో గడువు సమయంలో మెుత్తం 3396 మద్యం షాపులకు 65 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. ఈ క్రమంలో చంద్రబాబు సర్కార్ విదేశీ మద్యం అమ్మకపు రేట్ల విషయంలో మందుబాబులకు ఝలక్ ఇచ్చింది. ప్రస్తుతం దేశంలోనే తయారవుతున్న విదేశీ మద్యం విషయంలో బాటిపై ఉండే ధరపై ప్రవిలేజీ ఫీజును వసూలు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అన్ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఇక్కడ ఒక్కో బాటిపై ఉండే ధరకు రూ.10 ప్రివిలేజీ ఫీజుగా వసూలు చేయనున్నారు. ఉదాహరణకు బాటిల్ ఎమ్మార్పీ ధర రూ.150.50 గా ఉంటే దాన్ని రూ.160కి ప్రివిలేజ్ ఫీజు పెంచబడుతుంది.

మరో మూడు రోజుల్లో అంటే అక్టోబర్ 16 నుంచి నూతన మద్యం పాలసీ కింద ఏపీలో లిక్కర్ కొత్త ధరలు అమలులోకి వస్తున్నాయి. ఈ మద్యం పాలసీలో రౌండాఫ్ పేరుతో ఛార్జీలు వసూలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉదాహరణకు ఈ లెక్కన మద్యం బాటిళ్ల ధర రూ.160 కంటే 50 పైసలు ఎక్కువగా ఉన్నాసరే దానిని రూ.170కి విక్రయించబడతాయని తెలుస్తోంది. అలాగే లిక్కర్ ధర బాటిల్ పై రూ.250.50 ఉంటే దానిని రూ.260కి విక్రయిస్తారని తెలుస్తోంది. కానీ స్టార్టింగ్ ధర రూ.99 కింద విక్రయించే లిక్కర్ విషయంలో మాత్రం ఇది వర్తించదని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రేపు జిల్లాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో కొత్త లిక్కర్ షాపుల లైసెన్సుల జారీకి లాటరీలు తీసే కార్యక్రమం జరగనుంది. దీని తర్వాత 16 నుంచి కొత్త మద్యం షాపులు తెరుకుంటాయని తెలుస్తోంది.
గతంలో మద్యం షాపుల వేలంలో పాల్గొనే వ్యక్తులు డిపాజిట్ చేసిన సొమ్ము రీఫండ్ ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఏపీ సర్కార్ తెలంగాణ మాదిరిగా కొత్త లైసెన్సింగ్ పాలసీని తీసుకురావటంతో డబ్బులు ఉన్నోళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరోవైపు మద్యం షాపులకు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం లైసెన్సు పొందాలంటే రూ.55 లక్షల నుంచి 85 లక్షల వరకూ ఫీజులు నిర్ణయించారు. అయినా వీటికి భారీ స్పందన వస్తోంది. నోటిఫికేషన్ జారీ చేసిన తొలి రోజు 200 దరఖాస్తులు రాగా, గత రెండు రోజుల్లో 2,800కు పైగా వచ్చాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు రుసుముల రూపంలో రూ.60 కోట్లు సమకూరినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నెల 9వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. దీంతో భారీగా దరఖాస్తులు రావొచ్చని అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications