AP Budget 2025: ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం బడ్జెట్లో అత్యధికంగా సంక్షేమానికే చోటిచ్చిన సంగతిని గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రజల ఆరోగ్యానికి కొండంత అండగా నిలవాలని కూడా సర్కార్ నిర్ణయించింది.
నేడు వార్షిక బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ కొత్తగా నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు రూ.25 లక్షల బీమా సౌకర్యాన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. పథకం ఈ ఏడాది నుంచి అమలులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. ఇది ఇప్పటికే ఉన్న అరోగ్యశ్రీ కంటే మెరుగైన వైద్య సేవలను ప్రజలకు అందిస్తుందా లేదా అనే అంశం పూర్తిగా నిర్థారణ కాలేదు. అయితే దీనికి సంబంధించిన నియమ నింబంధనలపై బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయకపోవటంతో ఎవరెవరు దీనిని పొందటానికి అర్హులనే అంశంపై కొంత స్పష్టత కొరవడింది.

నేటి కాలంలో కనీసం జ్వరం వస్తే ఆసుపత్రుల్లో వేలకువేలు ఖర్చవుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం తెస్తున్న కొత్త స్కీమ్ సామాన్య, మధ్యతరగతి ప్రజలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గిస్తుందని తెలుస్తోంది. ఒక్క రోగం వస్తే చాలు జీవితకాలం సంపాదించిన డబ్బులు కరిగిపోతున్న నేటి రోజుల్లో ప్రభుత్వం మెరుగైన ఇన్సూరెన్స్ కవరేజ్ అందించటం వాస్తవంగా ప్రజలకు అత్యంత ఉపయోగకరంగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే త్వరలోనే ప్రభుత్వం దీనికి సంబంధించిన రూల్స్ విడుదల చేయవచ్చని వారు భావిస్తున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మెుదటి సారి నేటు పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టబడింది. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ.3.22 లక్షల కోట్ల బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇదే క్రమంలో రాష్ట్రానికి వెన్నెముకలా ఉన్న వ్యవసాయ రంగానికి దాదాపు రూ.48 వేల కోట్లను కేటాయించటం జరిగింది.
తాజా బడ్జెట్లో ఏపీ ప్రభుత్వం రెవెన్యూ వ్యయాన్ని రూ.2.51 లక్షల కోట్లుగా ఉంచగా.. ఇందులో రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించింది. అలాగే మూలధన వ్యయాన్ని రూ.40.63 వేల కోట్లుగా ఉంచింది. ఇదే క్రమంలో ద్రవ్యోలోటు రూ.79,926గా అంచనా వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ఇదే క్రమంలో వివిధ రంగాలకు ప్రకటించిన మెుత్తాలను పరిశీలిస్తే.. వెనుకపడిన వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వెయ్యబడింది.


Click it and Unblock the Notifications