AP Free Bus Scheme Latest News: ఆంధ్రప్రదేశ్‌లో మహిళల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది.ఇందులో భాగంగా స్త్రీశక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా ఆగస్టు 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బస్సు సర్వీసును ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ పథకం కింద రాష్ట్రంలోని అన్ని జిల్లాల మహిళలు, ట్రాన్స్‌జెండర్లు టికెట్ ఖర్చు లేకుండా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు,సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ వంటి అనేక సర్వీసుల్లో మహిళలంతా టికెట్ ఖర్చు లేకుండా ప్రయాణించవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా 6,700 బస్సులు.. అంటే మొత్తం APSRTC బస్సులలో సుమారు 74 శాతం బస్సులను ఈ పథకానికి కేటాయించారు. వీటితో పాటు రద్దీని తగ్గించేందుకు అదనపు బస్సులను కూడా సిద్ధం చేసింది కూటమి ప్రభుత్వం. ఈ ఉచిత బస్సు సౌకర్యం రాష్ట్ర సరిహద్దుల్లోపల ఎక్కడినుంచి ఎక్కడికైనా వర్తిస్తుంది. గుర్తింపు కోసం ఆధార్, ఓటర్ ఐడీ లేదా రేషన్ కార్డు చూపిస్తే చాలు. వయస్సు పరిమితి లేదని ప్రభుత్వం తెలిపింది. ట్రాన్స్‌జెండర్లూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది.
అయితే ఈ పథకం కింద ఒక మినహాయింపు ఉంది.. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సులు ఈ పథకానికి వర్తించవు. ఈ రూట్‌లో మహిళలు టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని RTC ఎండీ ద్వారకా తిరుమలరావు స్పష్టంచేశారు.

ప్రస్తుతం రోజూ సుమారు 15 లక్షల మంది మహిళలు RTC బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అధికారులు అంచనా వేస్తున్నట్లుగా ఉచిత ప్రయాణం అందుబాటులోకి రాగానే ఈ సంఖ్య 26 లక్షలకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై సంవత్సరానికి దాదాపు రూ. 1,950 కోట్ల ఆర్థిక భారం పడనుంది. అయినప్పటికీ.. మహిళల సాధికారత కోసం ఈ భారీ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది.
ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే నెలల్లో 3,000 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తామని తెలిపారు. తర్వాతి రెండు సంవత్సరాల్లో మరో 1,400 బస్సులు చేర్చే ఆలోచనలో ఉన్నట్లు ప్రకటించారు. అదేవిధంగా, స్మార్ట్ కార్డ్ వ్యవస్థను ప్రవేశపెట్టి మహిళలు టికెట్ చూపించకుండానే సులభంగా ఉచిత ప్రయాణం పొందే విధంగా సాంకేతిక మార్పులు తీసుకురానున్నట్లు వెల్లడించారు.
ఇక భద్రతా పరంగా కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. మహిళా కండక్టర్లకు బాడీ కెమెరాలు, బస్సుల్లో CCTV కెమెరాలు అమర్చడం వంటి చర్యలు చేపట్టనున్నారు. ఇది ఉచిత ప్రయాణాన్ని మాత్రమే కాకుండా, మహిళల భద్రత, గౌరవం కోసం కూడా కీలకంగా మారనుంది.
ఉచిత ప్రయాణం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు విద్య, ఉద్యోగ, వైద్య అవసరాల కోసం నగరాలకు సులభంగా ప్రయాణించే అవకాశం ఉంది. ఉద్యోగస్థ మహిళలకు నెలవారీ ప్రయాణ ఖర్చు గణనీయంగా తగ్గిపోవడం వల్ల కుటుంబ ఆదాయంపై ఒత్తిడి తగ్గుతుంది. సామాజికంగా ఇది మహిళల చలనం పెంచి, ఆర్థిక స్వావలంబనకు దోహదపడనుంది.ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది.
ప్రస్తుతం బస్సుల్లో సీటింగ్ విధానంలో ముఖ్యమైన మార్పులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ఉన్న మూడు + రెండు సీటింగ్ స్థానంలో పలు మార్పులు చేయనున్నారు. ఉచితం కాబట్టి రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున మహిళలు ప్రయాణించేందుకు వీలుగా రెండు + రెండు సీటింగ్ వ్యవస్థను కొత్తగా అందుబాటులోకి తీసుకురానున్నారు.
రద్దీని నివారించడానికి పలు రకాల వ్యూహాలు రచిస్తున్నారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు బస్సుల సంఖ్యను వీలును బట్టి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో మహిళలు ఎక్కువగా ప్రయాణించే అవకాశం ఉంది కాబట్టి బస్సు సర్వీసులను పెంచడం ద్వారా ఈ సౌకర్యాన్ని మెరుగుపరచనునుంది ఏపీ ప్రభుత్వం.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications