AP Free Bus Scheme Latest News: ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ ప్రభుత్వం కీలక అప్ డేట్ ఇచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని చంద్రబాబు సర్కారు తెలిపింది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాడానికి ఆర్టీసి అధికారుల వేగంగా అడుగులు వేస్తున్నారు. కొత్త విధానంలో ఈ స్కీమ్ మహిళలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
ప్రస్తుతం బస్సుల్లో సీటింగ్ విధానంలో ముఖ్యమైన మార్పులు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ఉన్న మూడు + రెండు సీటింగ్ స్థానంలో పలు మార్పులు చేయనున్నారు. ఉచితం కాబట్టి రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున మహిళలు ప్రయాణించేందుకు వీలుగా రెండు + రెండు సీటింగ్ వ్యవస్థను కొత్తగా అందుబాటులోకి తీసుకురానున్నారు. రద్దీని నివారించడానికి పలు రకాల వ్యూహాలు రచిస్తున్నారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు బస్సుల సంఖ్యను వీలును బట్టి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో మహిళలు ఎక్కువగా ప్రయాణించే అవకాశం ఉంది కాబట్టి బస్సు సర్వీసులను పెంచడం ద్వారా ఈ సౌకర్యాన్ని మెరుగుపరచనునుంది ఏపీ ప్రభుత్వం.

ఇక ఉదయం స్టూడెంట్లు, ఇతర ప్రయాణికుల ప్రయాణ సౌలభ్యం కోసం కూడా పలు మార్పులను చేస్తోంది. మార్నింగ్, ఈవినింగ్ వేళల్లో మాత్రమే నడిచే బస్సులను..ఆ రోజంతా నడిపేలా ఆర్టీసీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ చర్యలు మహిళలకు నిరంతరాయ ప్రయాణ అనుభవాన్ని అందించడంతో పాటు, రద్దీ సమయాల్లో ఒత్తిడిని తగ్గించడానికి దోహదపడతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఉచిత పథకం వల్ల ఆర్టీసీకి ఆర్థిక లోటు ఏర్పడకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేసిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగానే కార్గో సేవలను మెరుగుపరచడం..బస్టాండ్‌లలో ఖాళీ స్థలాలను లీజుకు ఇవ్వడం.. లగ్జరీ బస్సుల సంఖ్యను పెంచడం వంటి చర్యలపై దృష్టి సారించనుంది. కాగా ఆర్టీసీ నడిపే అన్ని రకాల బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
మహిళల, ట్రాన్స్‌జెండర్లు రాష్ట్రంలోని వివిధ బస్సు సర్వీసుల్లో టికెట్ ఖర్చు లేకుండానే ప్రయాణించవచ్చు. అయితే ఈ సౌకర్యం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ వంటి బస్సుల్లో మాత్రం అందుబాటులోకి రానుంది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే సప్తగిరి ఎక్స్‌ప్రెస్ బస్సులు ఈ ఉచిత ప్రయాణ పథకం నుంచి మినహాయింపు పొందాయి. ఈ రూట్‌లో మాత్రం మహిళలు ప్రయాణం చేయాలంటే టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు.
మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరిహద్దుల్లోపల ఉచితంగా ప్రయాణించవచ్చు. గుర్తింపు కోసం ఆధార్, ఓటర్ కార్డు లేదా రేషన్ కార్డు చూపిస్తే సరిపోతుంది. దీనికి వయో పరిమితి లేదు.ప్రస్తుతం రోజూ సుమారు 15 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని ఆర్టీసీ చెబుతోంది. ఈ ఉచిత సౌకర్యం వల్ల ఈ సంఖ్య 26 లక్షలకు పెరిగే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పథకం వల్ల చంద్రబాబు ప్రభుత్వంపై సంవత్సరానికి దాదాపు రూ. 1,950 కోట్ల భారం పడనుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications