అమరావతి: పేదలకు వైద్య చికిత్సల కోసం ఆరోగ్యశ్రీ కార్డులు, రేషన్ సరుకుల కోసం బియ్యం కార్డులు జారీ చేసేందుకు బుధవారం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. పలు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. కాపుల కోసం కొత్త పథకం, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుల సంఖ్య పెంపు, వైయస్సార్ నవశకం, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి వాటికి ఆమోదం తెలిపింది. అలాగే, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీపై కూడా చాలామందికి ఊరట కల్పించింది.

ఆదాయ పరిమితి డబుల్
ఏపీలో కొత్త బియ్యం కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. ఇందుకు ఆదాయ పరిమితుల్లో మార్పులు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.5వేల నుంచి రూ.10,000కు (సంవత్సరానికి రూ.1.20 లక్షలు) పెంచారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.6,500 నుంచి రూ.12,000కు (సంవత్సరానికి రూ.1.44 లక్షలు) పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. బిలో పావర్టీ లైన్ (BPL) ఆదాయ పరిమితిని చివరిసారి 2008లో సవరించారు. దీనిని మళ్లీ సవరించాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది.

పేదలు, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు జారీ
అర్హులందరికీ బియ్యం కార్డులు ఇస్తారు. అర్హులైనా లబ్ధి పొందని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి, కార్డులు జారీ చేస్తారు. రేషన్ సరుకుల కోసం ప్రత్యేకంగా బియ్యం కార్డుల జారీపై నిర్ణయం తీసుకున్నారు. ఆరోగ్య చికిత్సల కోసం ప్రత్యేకంగా పేదలు, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు కార్డ్స్ జారీ చేయనున్నారు. ఆరోగ్యశ్రీతో పాటు రేషన్, విద్యా దీవెన వంటి పథకాలకు వేర్వేరు కార్డులు జారీ చేస్తారు.

వారందరికీ కార్డులు..
అమ్మఒడి మొదలు ఫీజు రీయింబర్స్‌మెంట్స్ వరకు ప్రత్యేక కార్డుల జారీకి సిద్ధమైంది. పౌరసరఫరాల సంస్థ ద్వారా ఈ కార్డుల ముద్రణ చేపట్టనుంది. డిసెంబరు నాటికి నవశకం కార్యక్రమం ద్వారా సర్వే పూర్తి చేసి 2020 జనవరి ఒకటో తేదీ నుంచి కార్డుల జారీకి శ్రీకారం చుట్టనున్నారు. పథకాల అమలుకు మాగాణి, మెట్ట భూమి పరిమితి ఉంది. కాబట్టి ఎక్కువ ఎకరాలు ఉన్న రైతులకు కూడా కార్డులు చేతికి రానున్నాయి. కార్డుల ముద్రణ కోసం పౌరసరఫరాల శాఖ రూ.20 కోట్లు ఖర్చు చేసేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications