Adani News: విశాఖలో అదానీ డేటా సెంటర్.. శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్..
Adani News: చాలా కాలంగా ఎదురుచూస్తున్న అదానీ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతోంది. మే 3న విశాఖపట్నంలో అదానీ డేటా సెంటర్‌కు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దీనికి శంకుస్థాపన చేయనున్నారు.
అదానీ గ్రూప్ విశాఖలో 130 ఎకరాల ప్రాంగణంలో మెగా డేటా సెంటర్, ఇంటిగ్రేటెడ్ ఐటీ పార్కును ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం కంపెనీ ఏకంగా రూ.14,000 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 25 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.

2020లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం.. డేటా సెంటర్ మూడు సంవత్సరాలలోపు తన కార్యకలాపాలను ప్రారంభించి, భూసేకరణ తేదీ నుంచి ఏడేళ్లలోపు ప్రాజెక్ట్ లోని అన్ని అంశాలను పూర్తిచేయాల్సి ఉంది. ఈ క్రమంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించిన విశాఖ నగరంలో పనులు వేగం పుంజుకున్నాయి. ఈ క్రమంలో మే 3న శంకుస్థాపనకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఐటీ రంగం ఏపీలో చాలా కాలంగా నెమ్మదిగా, పేలవమైన అభివృద్ధిని నమోదు చేస్తోంది. ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖలో ఐటీ కంపెనీలు ఎక్కువగా లేవు. 2021-2022 నాటికి మొత్తం ఐటీ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా కేవలం 0.14 శాతంగా ఉండటం దీనికి అద్ధం పడుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విశాఖలో తగినంత మౌలిక సదుపాయాలు లేదా ఐటీ పార్కులు లేకపోవడం వల్ల యువత ఉపాధి అవకాశాల కోసం ఇతర నగరాలకు వలస వెళుతున్నారు. అయితే తాజా చర్యల వల్ల ఇకపై పరిస్థితుల్లో మార్పులు రావొచ్చని తెలుస్తోంది.
డేటా సెంటర్ ప్రాజెక్ట్ విశాఖను ఎకనామిక్ హబ్‌గా మారుస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. ఏపీకి చెందిన ఐటీ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. అయితే అదానీ డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా 24,990 మందికి, పరోక్షంగా 10,610 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఏపీకి మరిన్ని పెట్టుబడులు, పరిశ్రమలను ఆకర్షించటం ద్వారా యువకతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలని జగన్ సర్కార్ భావిస్తోనది మంత్రి అమర్‌నాథ్ తెలిపారు.


Click it and Unblock the Notifications