CM Jagan: కేంద్ర మంత్రి నిర్మలమ్మతో సీఎం జగన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ..
Nirmala Sitharaman: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. వీరి మధ్య సమావేశం దాదాపు 40 నిమిషాలపాటు సాగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు.
ఏపీకి కేంద్రం అందిస్తున్న సహకారానికి సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రమంలో 2014-15కి సంబంధించిన వనరుల గ్యాప్ ఫండింగ్, 2016-2019 మధ్య కాలంలో జరిగిన పరిమితికి మించి రుణాలు కారణంగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న పర్యవసానాలు, 2021-22లో రుణాల పరిమితిపై సడలింపులపై భేటీలో చర్చించారు.

రాష్ట్రాన్ని విభజించిన తర్వాత తెలంగాణ డిస్కంలకు ఏపీ జెన్‌కో సరఫరాచేసిన విద్యుత్ బకాయిలు రూ.6,756.92 కోట్లపై సీఎం ప్రస్థావించారు. ఇప్పటికే ఈ విషయాన్ని పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన విషయాన్ని తెలిపారు. ఏపీ జెన్‌కో ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని వెల్లడించారు. అందువల్ల జాప్యం లేకుండా వీలైనంత త్వరగా డబ్బు ఇప్పించాలని విన్నవించారు.
రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టే క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్ మీద కేంద్ర ప్రభుత్వం స్పెషల్ అసిస్టెన్స్ ఇచ్చేలా బడ్జెట్‌లో పొందుపరిచారని.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాల్లో అనేక విప్లవాత్మక చర్యలు చేపట్టిందని సీఎం తెలిపారు. స్కూళ్లలో నాడు-నేడు కింద రూ.6 వేల కోట్లు ఖర్చు చేసి 15,717 పాఠశాలల రూపురేఖలను మార్చినట్లు తెలిపారు. అలాగే 6వ తరగతి నుంచి ఐఎఫ్‌పీ ప్యానెల్స్ కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు.

ఇదే సమయంలో ఆరోగ్య రంగంలో కూడా ఏపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. విలేజ్ క్లినిక్స్ నుంచి టీచింగ్ ఆస్పత్రులవరకూ నాడు -నేడు కింద పనులు చేపట్టినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభవిష్యత్తును ఈ కార్యక్రమాలు తీర్చిదిద్దుతాయని.. వీటికోసం చేసిన ఖర్చును క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించి స్పెషల్ అసిస్టెన్స్‌ను వర్తింపు చేయాల్సిందిగా సీఎం కోరారు. నీతిఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గోనున్న ముఖ్యమంత్రి.


Click it and Unblock the Notifications