ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీపై శుభవార్త చెప్పారు. ఈ స్కీం కింద మరిన్ని వైద్య సేవలను జోడించారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటించారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి, ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ఆరోగ్యశ్రీ అంశాన్ని ప్రస్తావించారు.

ఆరోగ్యశ్రీలో మరో వెయ్యి సేవలు, రూ.1000 దాటితే వర్తింపు
ఇక నుంచి ఆరోగ్యశ్రీ పథకం కింద 2,059 వ్యాధులకు వైద్య సేవలు అందించనున్నారు. ఇంతకుముందు 1,059 సేవలు మాత్రమే ఆరోగ్యశ్రీలో ఉండేవి. ఇప్పుడు మరో వెయ్యి సేవలను జోడించారు. వైద్య సేవల ఖర్చు రూ.1,000 దాటితే ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తారు.

క్యాన్సర్ రోగులకు ఊరట
ఫిబ్రవరి 1వ తేదీ నుంచి క్యాన్సర్ రోగులకు కూడా ఆర్థిక ఊరట దక్కనుంది. ఇక నుంచి వారు ఒక్క రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. క్యాన్సర్ రోగులకు పూర్తిగా వైద్య ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది.

ఆరోగ్యశ్రీకి ప్రత్యేక క్యూఆర్ కోడ్
ఆరోగ్యశ్రీకి ప్రత్యేక కార్డులు ఇస్తున్నారు. ఈ రోజు (డిసెంబర్ 3) తేదీ నుంచి మొత్తం కోటి 42 లక్షల కార్డులు ఇస్తారు. ఆరోగ్యశ్రీ కార్డుకు ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఉంటుంది. జిల్లాల వారీగా వరుసగా ఇస్తారు.

ఆదాయం ఎంత ఉండాలి? ఏప్రిల్ నుంచి అమలు...
ఆరోగ్యశ్రీ పథకం వర్తించాలంటే కుటుంబ ఆదాయం రూ.5 లక్షలకు మించవద్దు. ఈ ఆదాయం లోపు ఉంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. జనవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 510 రకాల మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఏప్రిల్ నుంచి ఆరోగ్యశ్రీ ద్వారా సరఫరా చేసే మెడిసిన్స్ నాణ్యత మరింత పెంచనున్నారు. ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ అమలవుతుంది.

ఆరోగ్యశ్రీ కార్డులు ఎక్కడ పంపిణీ చేస్తారు?
సచివాలయాల ద్వారా గ్రామాలలో ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేస్తారు. ప్రతి 350 ఇళ్లకు ఆశా వర్కర్‌ను అటాచ్ చేస్తారు. అర్హులైన వారందరికీ కార్డులు ఇస్తారు.

ఆంధ్రప్రదేశ్ సహా ఈ నగరాల్లోను...
ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర ప్రధాన నగరాల్లోను ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో 150 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది.

విశ్రాంతి సమయంలోను ఆర్థిక సాయం
ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్ చేయించుకున్న తర్వాత విశ్రాంతి సమయంలోను పేషెంట్లకు ఆర్థిక సహాయం అందించనుంది ప్రభుత్వం. రోజుకు రూ.225 లేదా నెలకు రూ.5,000 ఆర్థిక సాయం అందుతుంది. ఫిబ్రవరి 1 నుంచి 6 వరకు అవ్వ, తాతలకు కంటి వెలుగు కార్యక్రమం నిర్వహిస్తారు. వారికి ఉచిత కళ్లజోడు అందిస్తారు.

ఆసుపత్రిలోని కార్మికులకు డబుల్ వేతనం
పుట్టుకతో చెవుడు, మూగ ఉన్న పిల్లలకు ప్రభుత్వం అండగా ఉండనుంది. డయాలసిస్ రోగులకు రూ.10,000 పెన్షన్ ఇస్తారు. పక్షవాతం, తలసేమియా ఉంటే రూ.5వేలు ఇస్తారు. ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య కార్మికులను జీతం రూ.8వేల నుంచి రూ.16వేలకు పెంచుతున్నట్లు చెప్పారు. మార్చి నాటికి 1056 అంబులెన్సులు అందుబాటులోకి తేనున్నారు. మే నెల వరకు ఖాళీగా ఉన్న డాక్టర్, నర్సు పోస్టులను భర్తీ చేస్తారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications