Vidya Deevena: చదవుకోవాలనే కోరికకు ఆర్థిక సాయం ఎంత అవసరమో అందరికీ తెలుసు. విద్య ఖరీదైనదిగా మారిన ఈ రోజుల్లో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్ధులు ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో కోర్సులు చదువుకోవటానికి ఏపీ ప్రభుత్వం చేయూతను అందిస్తోంది.

టాప్ యూనివర్సిటీల్లో..
ప్రపంచంలోని ప్రఖ్యాత 200 విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు పొందిన 213 మంది తెలుగు విద్యార్థులకు 'జగనన్న విదేశీ విద్యాదీవెన' కింద మెుదటి విడత సాయాన్ని సీఎం జగన్ నేడు విడుదల చేశారు. క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి ముఖ్యమంత్రి రూ.19.95 కోట్లను విడుదల చేశారు. ఈ సొమ్ము నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమయ్యాయి. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాన్ని అందిపుచ్చుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.

ప్రభుత్వం అండగా..
లక్షల రూపాయలు ఫీజులుగా ఉండే కార్నిగీ మిలన్, యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, మాస్టర్స్ ఇన్ హెల్త్ ఇన్‌ఫర్మేటిక్స్, బోస్టన్ యూనివర్సిటీ వంటి చోట్ల ప్రతిభతో సీటు వచ్చినా తల్లిదండ్రుల మీద భారం మోపలేక వెనకడుగువేస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం అండగా నిలవటంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తోడుగా నిలవటంపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం దీనిని మానవ వనరుల మీద పెడుతున్న అత్యుత్తమ పెట్టుబడిగా భావిస్తోంది. ఇది ప్రతి ఒక్కరి తలరాతను మార్చేందుకు దోహదపడుతుంది.

గొప్పవారైన భారతీయులు..
ప్రపంచ స్థాయి యూనివర్సిటీల్లో చదువుకున్న అనేక మంది భారతీయులు చరిత్రలో నిలిచిపోయారు. నాటి మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, అంబేడ్కర్ నుంచి నేటితరానకి చెందిన సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, అరవింద కృష్ణ, శంతను నారాయణ్ వంటి వారు విద్య ద్వారా దేశఖ్యాతిని పెంచినవారిలో ఉన్నారు. తెలుగు విద్యార్థులు సైతం ఇలాంటి వారిని స్పూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది.

గత ప్రభుత్వం..
ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సాయం గత ప్రభుత్వం ఇచ్చిన దాని కంటే చాలా ఎక్కువ. కొందరు విద్యార్థులకు అప్పటి బకాయిల సొమ్ము విడుదల కాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అప్పట్లో ఒక్కో విద్యార్థికి ఫీజు పరిమితి కేవలం రూ.10-15 లక్షలు మాత్రమే ఉండేది. అందుకే జగన్ సర్కార్ పారదర్శకంగా టాప్-100 కాలేజీలను ఎంపిక చేసి గరిష్ఠంగా రూ.1.25 కోట్ల వరకు ఆర్థిక సాయం అందిస్తోంది. 100- 200 వరకు క్యూఎస్ ర్యాంకులు పొందినవాళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు 100 శాతం సాయంగా రూ.75 లక్షల వరకు ప్రభుత్వం అందిస్తోంది. ఈ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సీఎంఓ కార్యాలయం అండగా ఉంటుందని సీఎం వెల్లడించారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications