CM Jagan: ఆంధ్ర రాష్ట్రాన్ని అధికార YSRCP అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తోంది. వివిధ సంక్షేమ పథకాలతో ప్రజల చెంతకే పాలనను తీసుకెళ్లిన ఘనత CM YS జగన్ దే అనడంలో సందేహం లేదు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట ప్రభుత్వం ఇప్పటికే 3 రాజధానుల వైపు మొగ్గుచూపుతోంది. దీనికి తోడు త్వరలో రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఉత్తరాంధ్ర కేంద్రంగా రాజకీయాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో పలు అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి.. ముఖ్యమంత్రి ఓ అడుగు ముందే ఉన్నారు.
శ్రీకాకుళం జిల్లాపై CM జగన్ వరాల జల్లు కురిపించారు. అన్ని విధాలుగా జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి, అందుబాటులోని తీర ప్రాంతాన్ని వినియోగించుకోవడానికి ప్రణాళిక రచించారు. పలు వ్యాపార అవకాశాల్లో స్థానికి ప్రజలను భాగం చేయాలని చూస్తున్నారు. ఇందుకు గాను సంతబొమ్మాళి మండలంలో 4 వేల 362 కోట్లతో మూలపేట పోర్టు పనులకు భూమి పూజ చేశారు. తద్వారా సముద్ర వాణిజ్యంతో పాటు ఎగుమతి, దిగుమతుల్లో గణనీయ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది.

1250 ఎకరాల్లో 24 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో, 4 బెర్తులతో మూలపేటలో పోర్టు నిర్మించబోతున్నట్లు CM తెలిపారు. రెండేళ్లలో ఇది పూర్తవుతుందన్నారు. పోర్టు నిర్మాణానికి దాదాపుగా 2 వేల 950 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ట్రాఫిక్ పెరిగితే, పోర్టు సామర్ధ్యం 100 మిలియన్ టన్నులకు చేరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. పోర్టుకు అనుసంధానించే ప్రధాన రహదారులు, రైల్వే మార్గం, గొట్టా బ్యారేజీ నుంచి పైప్ లైన్ సహా ఇతర మౌలిక వసతులను కలుపుకుంటే మొత్తంగా 4 వేల 362 కోట్లను వెచ్చిస్తున్నట్లు ప్రకటించారు.
విశాఖ నుంచి 170 కిలోమీటర్లు, చెన్నై - కోల్‌కత్తా నేషనల్ హైవే - 16కు కేవలం 14 కిలోమీటర్లు, రైల్వే లైనుకు కేవలం 11 కి.మీ దూరంలో ఈ పోర్టు ఉండటం.. దాని అభివృద్ధికి కలిసొచ్చే అంశమని ముఖ్యమంత్రి వాపోయారు. దీని ద్వారా మరో రెండేళ్లలో ప్రత్యక్షంగా, పరోక్షంగానూ 35 వేల మందికి ఉద్యోగఅవకాశాలు లభిస్తాయన్నారు. పోర్టు వెంటే, దాని ఆధారిత అనుబంధ పరిశ్రమలు సైతం వెలుస్తాయన్నారు. తద్వారా లక్షల సంఖ్యలో స్థానికులు ఉపాధి పొందుతారని చెప్పారు.
ఇదేకాక ఎచ్చర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో దాదాపు 366 కోట్లతో ఫిషింగ్ హార్బర్, గొట్టా బ్యారేజ్ నుంచి హిరమండలం రిజర్వాయర్‌కు 176 కోట్లతో వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, 852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ప్రాజెక్టు ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులకు సైతం ముఖ్యమంత్రి శంకుస్ధాపన చేశారు. ఈ ప్రాజెక్టులు భవిష్యత్తులో జిల్లా ముఖచిత్రాన్ని మార్చేయనున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రానికి 974 కి.మీ సముద్రతీరం ఉంటే, అందులో శ్రీకాకుళం వాటా 193 కి.మీ. ఇంత విస్తార కోస్టల్ ఏరియా ఉన్నా పోర్టు కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, కనీసం ఫిష్ ల్యాండింగ్ సెంటర్ లేకపోవడం దురదృష్టకరమని CM అభిప్రాయపడ్డారు.
తాజా చర్యల వల్ల రానున్న రోజుల్లో జిల్లా.. చెన్నై, ముంబై తరహాలో దూసుకుపోతుందన్నారు. ఇక్కడి బిడ్డలు వలసలు మాని, స్థానికంగా ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి కల్పించడానికి చిత్తశుద్ధితో బాటలు వేస్తున్నట్లు చెప్పారు. ఇకపై మూలపేట మూలనున్న ఒక పేట కాదని, అభివృద్ధికి మూలస్తంభంగా నిలుస్తుందన్నారు.

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైనా రాష్ట్రంలో కేవలం 6 పోర్టులే ఉన్నాయని జగన్ గుర్తు చేశారు. అయితే తామూ అధికారంలోకి వచ్చిన 46 నెలల్లోనే 4 పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. మరో 10 ఫిషింగ్ హార్బర్ల నెలకొల్పడానికి సిద్ధమయ్యామన్నారు.
ఈ ప్రాంత అభివృద్ధే ధ్యేయంగా మే 3న భోగాపురం విమానాశ్రయ పనులు మొదలుపెడుతున్నామని ప్రకటించారు. అదేరోజు అదానీ డేటా సెంటర్ కు సైతం శంకుస్ధాపన చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విధంగా ప్రాంతాలతో పాటు పారిశ్రామిక, వాణిజ్య చరిత్రను సైతం మార్చడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications