Adani-Chandrababu: ప్రస్తుతం అదానీ సోలార్ ఎనర్జీ సరఫరా అగ్రిమెంట్లలో లంచాల అవినీతి జరిగిందని దర్యాప్తులో తేలినట్లు అమెరికా కోర్టులో అభియోగాలు మోపబడిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది మాత్రం ఏపీ సర్కార్. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాస్తవానికి సోలార్ డీల్ జరగటంతో దానిపై ప్రస్తుతం అధికారంలో ఉన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది.
అదానీపై లంచాల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో 7000 మెగావాట్ల సోలార్ ఎనర్జీ కొనుగోలుకు జరిగిన గత ఒప్పందాన్ని పూర్తిగా క్యాన్సిల్ చేయాలా లేక అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీతో రేట్ల గురించి తిరిగి చర్చలు జరిపి కొత్త అగ్రిమెంట్ చేసుకోవాలా అనే అయోమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. ఈ తరుణంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం ముందు ప్రధానంగా రెండు ఆప్షన్లు ఉన్నాయి. సమగ్రత ఒప్పందాన్ని అమలు చేయడం లేదా జరిమానాలు చెల్లించడం వల్ల రాష్ట్రానికి ఆర్థిక చిక్కులను తెచ్చిపెడతాయని తెలుస్తోంది.

గత టర్మ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పై రూ.1,750 కోట్ల లంచం ఆరోపణలతో ముడిపడి ఉన్న వివాదానికి సంబంధించిన వివిధ అంశాలను స్వయంగా పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు దీనిపై ఎలా ముందుకు వెళ్లాలి, ఎలాంటి పరిణామాలు ఉద్భవిస్తాయనే అంశాలను మంత్రివర్గానికి వివరించారు. ఈ క్రమంలో అదానీతో కుదుర్చుకున్న డీల్ క్యాన్సిల్ చేసుకోవటం వల్ల ఏపీ ఖజానాపై రూ.2,100 కోట్ల పెనాల్టీ భారం పడుతుందని తెలుస్తోంది. ఇదే క్రమంలో 7000 మెగావాట్ల పవర్ డీల్ అగ్రిమెంట్ ప్రకారం కొనసాగిస్తే రూ.1.61 లక్షల కోట్ల పవర్ బిల్ రూపంలో చెల్లించాల్సి వస్తుందని తెలుస్తోంది. అయితే రెండు సందర్భాల్లోనూ ఏపీకి ఆర్థికంగా నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉన్నందున దీనిని ఎలా చంద్రబాబు డీల్ చేస్తారనే ఉత్కంఠ అందరిలోనూ కొనసాగుతోంది.
ఏపీకి నష్టం ఇలా..
అదానీపై లంచం ఆరోపణలకు కేంద్రంగా ఉన్న గుజరాత్ ఆధారిత సోలార్ పవర్ ప్రాజెక్ట్ నుంచి ఏపీకి సరఫరా చేయబడే విద్యుత్ kWhకి రూ.2.49 చౌకగా అందుబాటులో ఉండని వెల్లడైంది. ఇక్కడ సోలార్ ప్యానెల్స్, సోలార్ సెల్‌లపై విధించే ప్రాథమిక కస్టమ్స్ సుంకం ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ చేయబడుతుందని డీల్ పత్రాల ప్రకారం బయటపడింది. దీని కారణంగా విద్యుత్ టారిఫ్ కిలోవాట్ కి అదనంగా 50 పైసలు పెరగనుంది. అంటే కిలోవాట్ ధర రూ.2.49 నుంచి రూ.3.069కి పెరగనుంది. అంటే దీని ప్రకారం ప్రభుత్వం విద్యుత్ కొనుగోలుకు అదనంగా మరో రూ.850 కోట్లు సమర్పించుకోవాల్సిందేనని వెల్లడైంది. వాస్తవానికి ఇది ప్రజలపై మరింత భారాన్ని మోపవచ్చని తెలుస్తోంది.
వాస్తవానికి సెప్టెంబరు 2024 నుంచి 3,000 మెగావాట్లను అందించాలని మొదట నిర్ణయించిన ఈ ప్రాజెక్ట్, గడువు దాటి రెండు నెలలు గడిచినా సప్లై ప్రారంభం కాలేదు. అయితే సవరించిన షెడ్యూల్ ప్రకారం విద్యుత్ సరఫరా ఏప్రిల్ 2025 నాటికి ఆంధ్రప్రదేశ్ 1,000 మెగావాట్ల విద్యుత్‌ను పొందడం ప్రారంభిస్తుందని, మరింత ఆలస్యం కారణంగా అదనంగా 1,000 మెగావాట్ల కాలపరిమితిని జనవరి 2026కి మార్చబడింది. ఇది వాస్తవంగా సెప్టెంబరు 2025 నాటికి వాగ్దానం చేసిన 6,000 మెగావాట్ల కంటే చాలా తక్కువ.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications