AP News: దాదాపు రెండు దశాబ్ధాల కిందట ఐటీ రంగం ప్రాముఖ్యతను దేశంలో ముందుగా గ్రహించి అమెరికా దిగ్గజ కంపెనీల సీఈవోలను కూడా హైదరాబాదుకు తీసుకొచ్చిన వ్యక్తి ఏపీ సీఎం చంద్రబాబు. అయితే కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో దానికి మించిన వృద్ధిని సాధించటానికి కొత్త ఆలోచనతో బయటకు వచ్చారు.
ఇప్పటికే దేశంలో ఐటీ నుంచి స్టార్టప్స్ వరకు వివిధ రంగాల్లో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలతో పోటీలో తగ్గేదేలే అని సీఎం చంద్రబాబు కొత్త ఆలోచనతో వచ్చారు. ఏపీలో మహిళా నిపుణులను సాధికారపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం చంద్రబాబు ఇందులో భాగంగా వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగ అవకాశాలను పెంచాలని నిర్ణయించారు. సీఎం అంతర్జాతీయ సైన్స్ లో మహిళలు అండ్ బాలికల దినోత్సవం సందర్భంగా వెల్లడించారు.

వాస్తవానికి కరోనా సమయంలో అనేక ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం సౌలభ్యాన్ని అందించిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత ఖచ్చితంగా ఆఫీసులకు రావాల్సిందేనని చెప్పటంతో చాలా మంది మహిళలు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి కారణం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సమస్యలేనని తేలింది. అయితే ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని తిరిగి పెంచేందుకు ఏపీ సీఎం ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ వంటి రంగాల్లో వీరి భాగస్వామ్యాన్ని పెంచాలని భావిస్తున్నారు.
Andhra Pradesh is planning "Work From Home" in a big way, especially for women.
— N Chandrababu Naidu (@ncbn) February 11, 2025
First, I would like to extend greetings to all women and girls in STEM on the International Day of Women and Girls in Science. Today, we celebrate their achievements and commit ourselves to providing… pic.twitter.com/En4g7pfEba
దీనికి ముందు సైతం గతంలో సీఎం చంద్రబాబు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వర్క్ ఫ్రమ్ హోం ఆపర్చునిటీలను ఆంధ్రప్రదేశ్ యువతకు అందుబాటులోకి తీసుకురావటానికి తాము కృషి చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. వాస్తవానికి ఇదొక వినూత్న ఆలోచన. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ ఆలోచనతో ముందుకు రాలేదు. ప్రపంచానికి ఏపీ నుంచి రిమోట్ వర్క్ ఫోర్స్ సప్లై చేయటం ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాలను అందిస్తుందన్నారు. ప్రస్తుతం కొత్తగా మార్కెట్లోకి వచ్చిన రిమోట్ వర్క్, కోవర్కింగ్ స్పేసెస్, నైబర్హుడ్ వర్క్ స్పేసెస్ వంటివి సానుకూల వర్క్ ఎన్విరాన్మెంట్ కల్పిస్తుందని నాయుడు పేర్కొన్నారు.
ఇదే సమయంలో చంద్రబాబు ఏపీ ఐటీ, జీసీసీ పాలసీ 4.0ను తీసుకొచ్చారు. వీటి ద్వారా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉపయోగించుకుంటూ పెద్ద అడుగులు వేయాలని నాయుడు ప్లాన్ చేస్తున్నారు. వీటి ద్వారా ఏపీలో ఐటీ పరిశ్రమతో పాటు జీసీసీల ఏర్పాటుతో కొత్త ఆర్థిక వ్యవస్థకు నాంది పలకాలని ఆయన చూస్తున్నారు. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలలో సంస్థలు తమ కార్యకలాపాలను ఏర్పాటు చేసుకోవడాన్ని సులభతరం చేస్తూ అత్యాధునిక ఐటీ కార్యాలయ స్థలాలను నిర్మించడానికి డెవలపర్‌లకు ప్రోత్సాహకాలు అందించేందుకు పాలసీ తీసుకురాబడుతోంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications