Chandrababu News: ఒకప్పుడు హైదరాబాద్ నగరాన్ని ఐటీ కంపెనీలకు కేంద్ర బిందువుగా మారటానికి సీఎం చంద్రబాబు చేసిన కృషి సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఏపీ-తెలంగాణ విడిపోయిన తర్వాత మరో హైటెక్ సిటీని ఏపీలో నిర్మించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఏపీ సర్కార్ విశాఖ సమీపంలో డేటా సిటీ, హౌసింగ్ డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌లను అభివృద్ధి చేయాలని చూస్తోంది. ప్రస్తుతం విశాఖకు సమీపంలో అభివృద్ధి చేస్తున్న డేటా సిటీ రానున్న కాలంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు దోహదపడుతుందని తెలుస్తోంది. గతంలో హైదరాబాదులో హైటెక్ సిటీని నిర్మించిన అనుభవంతో దానిని తిరిగి ఇక్కడ అనుకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా ప్రాజెక్టులో గూగుల్, టీసీఎస్ ముఖ్యమైన భాగస్వాములుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐటీ మంత్రి లోకేష్ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఇదే క్రమంలో ఇటీవలి దావోస్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో విశాఖలో డిజైన్ సెంటర్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఇక్కడ సర్వర్లలో ఉపయోగించే చిప్స్ తయారీకి ఉన్న అవకాశాన్ని పరిశీలించమన్నారు. అలాగే సర్వర్ల సర్వీసింగ్ కోసం కీలక కేంద్రంగా ఏపీని పరిగణించాలని కోరారు. ఇప్పటికే గూగుల్ క్లౌడ్ తన డిజైన సెంటర్లను దిల్లీ, ముంబైలలో ఏర్పాటు చేసిన తరుణంలో ఈ చర్చలు వచ్చాయి. అలాగే విశాఖలో డేటా సిటీ ఏర్పాటుకు గూగుల్ అవగాహన ఒప్పందంపై సంతకం చేసిన సంగతి తెలిసిందే.
ఇదే ప్రణాళికపై ఐటీ మంత్రి నారా లోకేష్ కొన్ని వారాల ముందు మాట్లాడిన సంగతి తెలిసిందే. విశాఖపట్నంను ప్రపంచంలోనే డేటా హబ్‌గా మార్చడానికి రాష్ట్రం కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు. దీనికి సంబంధించి విశాఖ మోదీ పర్యటన సమయంలో పునాది కూడా వేశారు. ఈ ప్రాజెక్టు విలువ దాదాపు రూ.2 లక్షల కోట్లుగా అంచనా వేయబడింది. దీనిని పూర్తి స్థాయిలో పూర్తి చేయటం వల్ల లక్షల్లో ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఇప్పటికే ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ ముందుకు రావటం కూడా విశాఖ టెక్ హబ్ గా మార్చటానికి జరుగుతున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఐటీ కంపెనీలు బెంగళూరు, చెన్నై, పూణే, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో తమ పెట్టుబడులను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టెక్ పరిశ్రమంతో ఎక్కువ సంబంధం కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్న కాలంలో ఇప్పటికే గుర్తింపు పొందిన నగరాల సరసన విశాఖను చేర్చుతారనే నమ్మకం కలుగుతోంది. అంటే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఐటీ, ఏఐ, డేటా సెంటర్లు, హెల్త్ కేర్ వంటి రంగాల్లో పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications