AP News: నేడు శ్రీసిటీకి సీఎం చంద్రబాబు.. ఒక్కరోజే 15 పరిశ్రమలు ప్రారంభం..
Chandrababu Naidu: ఏపీ ముఖ్యమంత్రి పరిపాలన ప్రారంభించిన కొన్ని నెలల్లోనే తనదైన మార్క్ పరిపాలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వరుసగా రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, ప్రాజెక్టులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇటీవల టాటాలతో చర్చలు జరిపిన తర్వాత తిరుపతి జిల్లాలో నేడు కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 10 గంటలకు బయల్దేరి 11.30 గంటలకు తిరుపతి ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా శ్రీసిటీకి వెళ్తారని తెలుస్తోంది. సత్యవేడు నియోజక వర్గం శ్రీసిటీలో సీఎం చంద్రబాబు నాయుడు నేడు పలు సంస్థల కార్యకలాపాలు ప్రారంభించనున్నారు. శ్రీసిటీలో రూ.900 కోట్ల పెట్టుబడితో ప్రారంభం కానున్న సంస్థల్లో సుమారు 2,700 మందికి ఉపాది పొందనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో 15 సంస్థల కార్యకలాపాలను ప్రారంభించటంతో పాటు మరికొన్ని కంపెనీలకు శంకుస్థాపనలు సీఎం చేయనున్నారు.

అలాగే మరో రూ.1213 కోట్ల పెట్టుబడులకు సంబంధించి నాలుగు కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుందని సమాచారం. చంద్రబాబు చేతులు మీదుగా సౌత్ కొరియాకు చెందిన ఎల్‌జికెమ్, ఇజ్రాయెల్ కు చెందిన నియోలింక్, జపాన్ కు చెందిన నైడిక్, జర్మనీకి చెందిన బెల్, ఓజేఐ ఇండియా ప్యాకేజ్, అడ్మైర్, బాంబేకోటెడ్ స్పెషల్ స్టీల్, ఇఎస్ఎస్కేఏవై, ఆటో డేటా, ఈప్యాక్, ఎవర్ షైన్, జెన్ లెనిన్, జేజీఐ, త్రినాథ్ సంస్థల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇదే క్రమంలో ఏపీ ప్రభుత్వం పెట్టుబడులకు సంబంధించి మరికొన్ని కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనుంది.
వివరాల్లోకి వెళితే సీఎం చంద్రబాబు పాత పరిచయాలను ఏపీలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఉపయోగిస్తున్నారు. రానున్న కాలంలో మరిన్ని పరిశ్రమలు ఏపీకి వస్తాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పెట్టుబడి పెట్టే సంస్థలకు ప్రభుత్వం నుంచి త్వరితగతిన అనుమతులతో పాటు అన్ని విధాలా ఏర్పాటుకు సహకారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అలాగే మంచి ప్రోత్సాహకాలను సైతం కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ముందుకువచ్చే సంస్థలు పొందుతాయని వారు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications