AP News: చంద్రబాబు ఎనర్జీ ప్లాన్ ఇదే.. నీ ముందు చూపుకు సలామ్ సీఎం సార్..!
Chandrababu Naidu: ఏపీలో కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత అభివృద్ధి కూతలు వేయటం ప్రారంభించింది. ముందుచూపు ఉన్న నాయకుడిగా పేరున్న ప్రస్తుత సీఎం చంద్రబాబు రాష్ట్ర భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారించారు. పెరుగుతున్న విద్యుత్ వినియోగంతో పాటు భారత ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు భారీ ప్రణాళిక రచిస్తున్నారు. ఇది రాష్ట్ర అవసరాలను తీర్చటంతో పాటు కొత్తగా ఉద్యోగ కల్పనకు దారితీయనుంది.
పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏపీలో 2030 నాటికి 72.60 గిగావాట్లకు పెంచాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారు. ఇదే సమయానికి భారతదేశ గ్రీన్ ఎనర్జీ లక్ష్యం 500 గిగావాట్లకు అనుగుణంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాంధీనగర్‌లో జరిగిన 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్‌మెంట్ మీట్‌లో వెల్లడించారు. ఇది కొత్తగా ఉపాధి అవకాశాలను సృష్టించటంతో పాటు ఏపీని గ్రీన్ ఎనర్జీ రంగంలో అగ్రగామిగా నిలబెడుతుందని పేర్కొన్నారు. భారీ స్థాయిలో ఉద్ఘారాలను తగ్గించి పర్యావరణాన్ని కాపాడుతుందని చెప్పారు.

ఏపీ భౌగోళికంగా విస్తృతమైన తీరప్రాంతం, బలమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, అద్భుతమైన రవాణా నెట్‌వర్క్‌లు కలిగి ఉందన్నారు. ఇది సోలార్, విండ్, పంప్‌డ్ స్టోరేజీ, గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ రంగాల్లో అద్భుతమైన అవకాశాలను ఉన్నాయని నొక్కి చెప్పారు. తాను దేశంలో గ్రీన్ ఎనర్జీ కోసం అత్యుత్తమ పర్యావరణ వ్యవస్థలలో ఒకదాన్ని సృష్టించాలనుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు తన విజన్ గురించి వెల్లడించారు. రెన్యూవబుల్ ఎనర్జీలో ప్రపంచ వ్యాప్తంగా అవలంభిస్తున్న ఉత్తమ పద్ధతులు, R&D, విధాన మద్దతు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు అడ్డంకులను తొలగించడం వంటి వాటి ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు.
ఎనర్జీ రంగంలో నూతన సాంకేతికతలను పంచుకోవడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి క్లీన్ ఎనర్జీ సర్క్యులర్ ఎకానమీ కోసం గ్లోబల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో 40GW సోలార్ ఎనర్జీ, 20 GW విండ్ ఎనర్జీ, 12GW పంప్‌డ్ స్టోరేజీ, 25 GW బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, 1 MTPA గ్రీన్ హైడ్రోజన్ అండ్ డెరివేటివ్స్, 2500 KLPD జీవ ఇంధనాలు, ఎలక్ట్రిక్ వాహనాల కోసం 500 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లతో పునరుత్పాదక ఇంధన సామర్థ్య లక్ష్యాలను రాష్ట్రం నిర్దేశించుకుందని సీఎం సభలో వెల్లడించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో టెక్నాలజీ రంగంపై దృష్టి పెట్టిన చంద్రబాబు ప్రస్తుతం విభజిత ఏపీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోతో పాటు ఎనర్జీపై కూడా పూర్తి స్థాయిలో దీర్ఙకాలిక వ్యూహాన్ని అవలంభించాలని చూస్తున్నారు.


Click it and Unblock the Notifications