Chandrasekaran: ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పరుగులు తీయించేందుకు చెకచెకా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో టాటా గ్రూప్‌ను రాష్ట్రాభివృద్ధికి సహకారం అందించాలని చంద్రబాబు కోరారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థికాభివృద్ధి కోసం ఒక టాస్క్‌ఫోర్స్‌ను ప్లాన్ చేస్తున్నారు. దీనికి టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సహ-అధ్యక్షుడిగా ఉండనున్నారు. వైజాగ్‌లో మెరుగైన ఎయిర్ కనెక్టివిటీతో పాటు టీసీఎస్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ క్రమంలో వైజాగ్‌లో టీసీఎస్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి అమరావతిలో చైర్మన్ చంద్రశేఖరన్‌తో చర్చలు జరిపారు. అలాగే ఎయిరిండియా, విస్తారాతో ఎయిర్ కనెక్టివిటీని పెంచే ప్రణాళిక గురించి ఇందులో చర్చలు జరిగాయి.

"ఈరోజు అమరావతిలో నా పాత స్నేహితుడు, టాటా సన్స్ ఛైర్మన్, శ్రీ నటరాజన్ చంద్రశేఖరన్‌తో నేను గొప్ప సమావేశం నిర్వహించాను", మేధావులు, పరిశ్రమల ప్రముఖులు సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి కోసం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ట్విట్టర్ పోస్టులో చంద్రబాబు వెల్లడించారు.
టాటా గ్రూప్ అమరావతిలో పోటీతత్వంపై CII సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్‌షిప్‌తో కూడా భాగస్వామిగా ఉంటుంది. పలు రంగాల్లోని భాగస్వామ్యాలపై చర్చించామని సీఎం ఈ క్రమంలో పేర్కొన్నారు. అమరావతిలో సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్‌షిప్ ఆన్ కాంపిటీటివ్‌నెస్‌ను ఈ సందర్భంగా ధృవీకరించారు. టాటా సన్స్ ఛైర్మన్ సహ-అధ్యక్షునిగా ఉన్న టాస్క్‌ఫోర్స్ సిఫార్సులను అమలు చేయడానికి సీఐఐ భాగస్వామ్యంతో పరిశ్రమల ఫోరమ్‌ను కూడా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ యువతలో నైపుణ్యాలు, ఉపాధిని పెంపొందించడంపై దృష్టి సారిస్తామని చంద్రబాబు వెల్లడించారు. CII మల్టీ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ (MSTI)తో పాటు మోడల్ కెరీర్ సెంటర్(MCC) ద్వారా దీన్ని నడిపించనున్నాట్లు చెప్పారు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీలో ఐటీ మరో విప్లవం వస్తుందని, అలాగే ఎలక్ట్రానిక్ తయారీ పరిశ్రమను మరింతగా పెంపు ప్రత్యేక దృష్టి సారిస్తారని యువత ఆకాంక్షిస్తున్నారు.


Click it and Unblock the Notifications