AP News: చైనా-జపాన్ కంటే బుల్లెడ్ స్పీడులో చంద్రబాబు.. ఆ తప్పు సరిదిద్దుకుంటూ..
Chandrababu News: ఏపీ సీఎం ఏ విషయంలోనైనా అభివృద్ధి చెందిన దేశాల కంటే ఒక అడుగు ముందుంటారని తెలిసిందే. కేవలం పరిపాలనలో మాత్రమే కాకుండా భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి అందరి కంటే 10 ఏళ్లు ముందుచూపుతో వ్యవహరించటంలో ఆయన దిట్ట. కానీ ఇప్పుడు ఆయన గతంలో చేసిన తప్పుడు సరిదిద్దుకునే పనిలో పడ్డారని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలను ఐటీ రంగంలో అగ్రగామిగా మార్చిన ఆయన ప్రస్తుతం విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం బుల్లెట్ వేగంతో పనిచేస్తున్నారు.
తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు కీలక చర్చకు దారితీశాయి. దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో వృద్ధ జనాభా పెరిగిపోవటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఏపీలో ప్రజలు ఎక్కువ మంది సంతానానికి జన్మనివ్వాలని, పిల్లలను కనాలని కోరారు. ఈ క్రమంలోనే ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారు మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేలా చట్టం తీసుకురావాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందని వెల్లడించారు. గడచిన ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురై ఆగిపోయిన రాజధాని అమరావతి పనుల గురించి మాట్లాడుతూ చంద్రబాబు ఈ విషయం వెల్లడించారు.

ఏపీలో ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న కుటుంబాలకు ప్రోత్సాహకాలు అందించడం, దంపతులు ఎక్కువమంది పిల్లల్ని కనేలా ప్రోత్సహిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేయకుండా నిరోధిస్తున్న పాత చట్టాన్ని రద్దు చేస్తామని అన్నారు. ప్రస్తుతం ఏపీలోని అనేక జిల్లాల్లో యువత ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వేరే నగరాల్లోకి, రాష్ట్రాలకు, దేశాలకు వలసవెళ్లిపోవటంతో గ్రామాల్లో ఎక్కువగా వృద్ధ జనాభా మాత్రమే ఉండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో జనాభా పెరుగుదల సగటు 1.6 శాతానికి పడిపోయింది. వాస్తవానికి ఇది దేశ సగటు రేటు 2.1 కంటే తక్కువగా ఉండటంపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ప్రస్తుత జనాభా ప్రకారం 2047 తర్వాత ఏపీలో యువత కంటే వృద్ధులు ఎక్కువగా ఉంటారని తేలింది.
ప్రస్తుతం బాగా అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకుంటున్న జపాన్, చైనా, అనేక యూరోపియన్ దేశాల్లో యువత కంటే వృద్ధ జనాభా భారీగా పెరిగిపోతున్న విషయాన్నీ ఈ క్రమంలో సీఎం ప్రస్థావించారు. చైనా ప్రభుత్వం సైతం ప్రస్తుతం తన వృద్ధ జనాభాకు సంక్షేమ పథకాలపై ఎక్కువగా డబ్బు వెచ్చిస్తోంది. జపాన్ వంటి దేశాల్లో చాలా మంది కనీసం పెళ్లిళ్లు చేసుకోవటానికి సైతం దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎక్కువ మంది పిల్లలను కనటం బాధ్యతగా చంద్రబాబు సూచించారు. ఇది వ్యక్తిగతంగా దేశ ప్రయోజనాల కోసం చేయాల్సిన పనిగా వ్యాఖ్యానించారు. గతంలో తాను జనాభా నియంత్రణకు అనుకూలంగా ఉంటూ స్థానిక ఎన్నికల విషయంలో చట్టాన్ని తెచ్చానని పేర్కొన్నారు. అప్పట్లో అధిక జనాభా వల్ల నీరు, భూమి మరియు ఇతర వనరుల కొరత ఏర్పడుతుందని నేను భయపడ్డానని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications