Chandr Babu: కేంద్ర మంత్రులతో CM చంద్రబాబు చర్చలు.. బడ్జెట్‌లో కీలక ప్రకటన కోసం రిక్వెస్ట్
BPCL News: ఇటీవల ఆంధ్రప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో NDA కూటమి విజయం సాధించింది. చంద్రబాబు నాయుడు CMగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రాష్ట్రానికి పలు ప్రాజెక్టులు తీసుకువచ్చేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. వారితో BPCLపై మంతనాలు వచ్చినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి.
APకి BPCL రిఫైనరీని మంజూరు చేయాలని CM చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులను కోరారు. ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా బడ్జెట్‌లో ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్రం నుంచి సహకారం కావాలని కోరుతూ దాదాపు అర డజను మంది మంత్రులను కలిశారు. రాష్ట్ర సమస్యలపైనా సకాలంలో జోక్యం చేసుకునే విధంగా సమర్థవంతమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి అనుగుణంగా ఆంధ్రాలో BPCL రిఫైనరీని ఏర్పాటు చేయాలని పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరీని చంద్రబాబు కోరారు. ఈ మేరకు BPCLతో మాట్లాడాల్సిందిగా అభ్యర్థించారు. ఏర్పాటుకు సంబంధించి ప్రకటన సైతం విడుదల చేసినట్లు CM తెలిపారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశ రిఫైనరీ సామర్థ్యాన్ని పెంపొందించడానికి కేంద్ర సాయం కోసం చర్చలు జరిపినట్లు చెప్పారు.
ఇదేకాక ఇతర అభివృద్ధి ప్రాజెక్టులపైనా పలువురు కేంద్ర మంత్రులతో మాట్లాడారు. అమరావతిలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ పనులకు మద్ధతివ్వాలని కోరారు. విభజన అనంతరం జరగాల్సిన ఆస్తులు, సంస్థల విభజన సమస్యల పరిష్కారానికి కృషిచేయాల్సిందిగా హోం మంత్రి అమిత్ షాను అభ్యర్థించారు. ఆంధ్రాకు ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ మంజూరుకు చర్యలు తీసుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తో చర్చలు జరిపారు.


Click it and Unblock the Notifications