AP News: ఏపీ సీఎం చంద్రబాబు మెగా ప్లాన్.. ఏకంగా 100 ఇండస్ట్రియల్ పార్క్స్..!!
Chandrababu Naidu: ఏపీలో కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న వేళ తొలి బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కొన్ని ముఖ్యమైన అభివృద్ధి పథకాలను ప్రకటించింది కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనీసం 100 ఎకరాల విస్తీర్ణంలో 100 పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పరిశ్రమలు అధికారులను ఆదేశించారు.
దీంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, వాటర్ రిసోర్సెస్, హార్టికల్చర్, మినరల్స్ విభాగాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక పారిశ్రామిక పార్కులు మహారాష్ట్రలో ఉండగా.. ఏపీలో ప్రస్తుతం 53 పార్కులు మాత్రమే ఉన్నాయని, రానున్న రోజుల్లో మరిన్ని పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు.

తమిళనాడు ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (SIPCOD) రాష్ట్రంలోని పారిశ్రామిక పార్కుల సంఖ్యను వచ్చే ఆరేళ్లలో 30 నుంచి 60కి రెట్టింపు చేయాలని యోచిస్తోందని SIPCOD మేనేజింగ్ డైరెక్టర్ కె.సెంథిల్ రాజ్ తెలిపారు. తమిళనాడులో ప్రస్తుతం 28 చిప్‌కోట్ ఇండస్ట్రియల్ పార్కులు దాదాపు 38,538 ఎకరాల్లో చిప్‌కాట్ సైట్‌లో అధికారికంగా ప్రకటించబడ్డాయి. అలాగే 2021లో కొత్త పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం అదనంగా 45,000 ఎకరాల భూమిని సేకరించనున్నట్లు ప్రకటించింది.
మోదీ 3.0 పాలనలో టీడీపీ పొత్తు కారణంగా అనేక ప్రాజెక్టులు ఆంధ్రాకు అనుకూలంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది సమీకృత ముడి చమురు శుద్ధి కర్మాగారం అండ్ పెట్రోకెమికల్ ప్లాంట్. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్న రిఫైనరీ, పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మచిలీపట్నం, రామాయపట్నం లేదా మూలపేటలో భూమిని కేటాయించవచ్చని తెలుస్తోంది. ప్లాంట్‌ను 9-12 మిలియన్ టన్నుల సామర్థ్యంతో నిర్మించాలని బీపీసీఎల్ యోచిస్తోంది. 9 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న రిఫైనరీకి రిఫైనరీ నిర్మాణాలపై ఆధారపడి దాదాపు 800 నుండి 1000 ఎకరాల భూమి అవసరం కానుంది. ఇది సదరు ప్రాంతాల్లో లక్షలాధి మందికి ఉపాధి కల్పిస్తుందని అంచనా.


Click it and Unblock the Notifications