AP Liquor News: ఏపీలోని మద్యం ప్రియలుకు షాకింగ్ వార్త ఒకటి ఉంది. కొత్త మద్యం పాలసీ కింద షాపులు ఓపెన్ అయి కొన్ని నెలలు కూడా పూర్తి కాని నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ వీటిపై సీరియస్ నిర్ణయాలు తీసుకుంటోంది. చాలా గ్రామాల్లో బెల్టు షాపులు రన్ చేసేందుకు అనుమతుల కోసం గీత కార్మికులు ఎదురుచూస్తుండగా, మరికొన్ని ఊళ్లలో మాత్రం రెండు బెల్టు షాపులు రన్నింగ్ అవుతున్నాయని తెలుస్తోంది. దీనిపై పెరిగిపోతున్న విమర్శలకు చెక్ పెట్టాలని చంద్రబాబు సర్కార్ రంగంలోకి దిగింది.
ఇప్పుడు మద్యం ప్రియులను నిరాశకు గురిచేస్తోన్న అంశం రెండు రోజుల పాటు వైన్ షాపులు క్లోజ్ కావటమే. వాస్తవానికి తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు ఏర్పాట్లు జరుగుతున్నవేళ మద్యం షాపులు క్లోజ్ కానున్నాయి. డిసెంబర్ 5న ఎన్నిక ఉండగా.. వీటి లెక్కింపు డిసెంబర్ 9న జరగనుంది. దీంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం నుంచి ఎన్నికరోజు సాయంత్రం నుంచి క్లోజ్ చేయబడనున్నాయి. దీంతో ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లోని మందుబాబులకు షాపులు అందుబాటులో ఉండవు.

గతంలో వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి మద్యం అమ్మకాలను పూర్తిగా ప్రభుత్వం చేపట్టేలా పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మద్యం అమ్మకాలపై పూర్తి నియంత్రణ అప్పట్లో ప్రభుత్వానికే ఉండేది. దానివల్ల ప్రభుత్వానికి మద్యం వల్ల ఆదాయం కూడా భారీగానే వచ్చింది. కానీ కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లాటరీ విధానంలో వీటిని ప్రైవేటు వ్యక్తులకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది లాటరీలో షాపులు దక్కించుకున్న నేతలు స్థానిక అధికార పార్టీ నేతల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. అలాగే వ్యాపారం నుంచి వచ్చే ఆదాయంలో వాటాలు సైతం అడగటంతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వార్తలు కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనేక ఊళ్లలో బెల్టు షాపులు సైతం విచ్చలవిడిగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు సైతం వస్తున్నాయి.
ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తులు షాపులను రన్ చేస్తున్న వేళ చాలా చోట్ల ఇప్పటికీ వివిధ మద్యం బ్రాండ్లను వాస్తవ ఎమ్ఆర్పీ ధరల కంటే ఎక్కువ రేట్లకు అమ్ముతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిస్థితులను కట్టడి చేసేందుకు, మద్యం అమ్మకాలను పారదర్శకంగా కొనసాగేలా చూసేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని సమాచారం. మద్యాన్ని ఎమ్ఆర్పీ ధరల కంటే ఎక్కువ రేట్లకు విక్రయించే షాపు యజమానులపై రూ.5 లక్షలు జరిమానాగా విధించనున్నట్లు ప్రభుత్వం హెచ్చరించింది. తొలిసారి జరిమానా విధించిన తర్వాత సైతం లెక్కచేయకుండా ఇదే తప్పును కొనసాగిస్తున్నట్లు గుర్తిస్తే సదరు షాపుకు లైసెన్స్ రద్దు చేయనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఆదాయం కోసం నిబంధనలు ఉల్లఘించేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఏపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించటంతో చాలా చోట్ల వ్యాపారులు అప్రమత్తం అవుతున్నారు. ఎక్సైజ్ అధికారులు సైతం ఇలాంటి ఆరోపణలు వచ్చిన షాపులపై చర్యలు వెంటనే ఉండేలా చూస్తుందని తెలుస్తోంది.
ఇదే క్రమంలో బెల్టు షాపులు చాలా గ్రామాల్లో విచ్చలవిడిగా పెరిగిపోవటంపై కూడా ఏపీ సర్కార్ దృష్టి సారించింది. బెల్టు షాపులకు అక్రమంగా మద్యం సరఫరా చేసే మద్యం షాపులకు రూ.5 లక్షలు జరిమానా విధించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది. ఇదే తప్పు మళ్లీ రిపీట్ చేసినట్లు తెలిస్తే వారి లైసెన్సులను రద్దు చేసేందుకు ఆదేశాలు జారీ చేయబడ్డాయి. అక్రమంగా మద్యం విక్రయాలను నివారించేందుకు సర్కార్ ఏపీ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 47(1) కింద నోటిఫికేషన్ జారీ చేయటంపై వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. బార్ల విషయంలోనూ ఇదే తరహా రూల్స్ వర్తిస్తాయని అధికారులు చెబుతున్నారు. సామాన్యులకు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా సరసమైన ధరలకు బ్రాండెడ్ మందును అందించేందుకు కొత్త మద్యం పాలసీలో పారదర్శకతను పెంచటానికి తాజా పాలసీ ఛేంజెస్ తీసుకొచ్చిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications