AP Investment Policies: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ బుధవారం ఆరు పారిశ్రామిక & పెట్టుబడి విధానాలకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా రానున్న 5 ఏళ్ల కాలంలో దాదాపు 20 లక్షల కొత్త ఉద్యోగాల కల్పనను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఏపీ పారిశ్రామిక అభివృద్ధి విధానం 4.0; ఏపీ MSME & ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ పాలసీ 4.0; ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0; ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0; ఏపీ ప్రైవేట్ పార్క్స్ పాలసీ 4.0, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 4.0 ఉన్నాయి.
రాష్ట్రానికి తిరిగి పరిశ్రమలను ఆకర్షించటానికి అనుకూలమైన పర్యావరణ వ్యస్థతో పాటు ప్రోత్సాహకాలను అందించటానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు ఈ సమావేశంలో వెల్లడించారు. ఈ విధానాలు ముందుచూపుతో రూపొందించబడ్డాయని అన్నారు. కొత్త విధానం ద్వారా దాదాపు రూ.83 వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించాలని చూస్తోంది. దీని ద్వారా తయారీ రంగంలో రూ.30 లక్షల కోట్లను ఆకర్షించి 5 లక్షల ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. అలాగే 33,200 కోట్ల రూపాయల ఎగుమతి సామర్థ్యంతో 175 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు.

నాలుగు పెట్టుబడి కేటగిరీలు, సబ్-లార్జ్ కేటగిరీ కింద రూ.50 నుంచి రూ.5,000 కోట్లకు పైగా అల్ట్రా-మెగా కేటగిరీ కింద అనుకూలీకరించిన ప్రోత్సాహక స్కీమ్‌తో పెట్టుబడి సామర్థ్యాలను గుర్తించినట్లు నాయుడు తెలిపారు. అధిక ఉద్యోగాలను వాగ్దానం చేసే కంపెనీలకు 10% వరకు అధిక ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ఏపీ సర్కార్ వెల్లడించింది. దీనికి తోడు కర్భన ఉద్ఘారాలను తగ్గించటంలో దృష్టిసారించే కంపెనీలకు 6 శాతం సబ్సిడీ ప్రోత్సాహకాలను అందిస్తామన్నారు. MSME & ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ పాలసీకి సంబంధించి, రాబోయే ఐదేళ్లలో ఒక కుటుంబం నుండి ఒక పారిశ్రామికవేత్తను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని నాయుడు చెప్పారు. ఆక్వా, అగ్రి అండ్ హార్టికల్చర్ ప్రాసెసింగ్, బయోటెక్నాలజీ, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్, డ్రోన్ తయారీ, ఎలక్ట్రిక్ వాహనాలు, రత్నాలు అండ్ ఆభరణాలు, తోలు అండ్ పాదరక్షలు, ఫార్మాస్యూటికల్, సెమీకండక్టర్ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పారిశ్రామికవేత్తల అభివృద్ధి కోసం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ ఐదు జోనల్ కేంద్రాలను కలిగి ఉన్న అమరావతిలో ప్రధాన కార్యాలయంతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ ఇన్నోవేషన్ హబ్ వచ్చే ఐదేళ్లలో రూ.500 కోట్ల కార్పస్ ఫండ్‌తో ఏర్పాటు చేయబడుతుందని పేర్కొన్నారు. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ విధానం కింద 300,000 ఉద్యోగాలను సృష్టించే అవకాశంతో తయారీ రంగంలో రూ.30,000 కోట్లను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ఏపీ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ కింద రానున్న ఐదేళ్లలో అన్ని ఎలక్ట్రానిక్ కేటగిరీల నుంచి రూ.84,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో 5 లక్షల మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications