ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నగరం అమరావతి అభివృద్ధికి ప్రపంచబ్యాంకు పచ్చజెండా ఊపింది. తాజాగా వాషింగ్టన్‌లో USD800 మిలియన్ల (సుమారు 6796 వేల కోట్లు) లోన్ ఆమోదించింది. ఈ నిధులు అమరావతిని ఎపి రాష్ట్రంలో ఒక ప్రముఖ ఆర్థిక కేంద్రంగా స్థాపించడంలో ఉపయోగపడుతుంది. అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంతంలో కీలక పాత్ర పోషించనుంది, ఇందులో విజయవాడ, గుంటూరు నగరాలు కూడా ఉన్నాయి. రాబోయే దశాబ్దాలలో పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా పట్టణ కేంద్రాలను నిర్మించాలనే భారతదేశ వ్యూహంలో ఈ ప్రాజెక్ట్ భాగం.
ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు నిన్న అమరావతి పట్టణాభివృద్ధి కార్యక్రమానికి 800 మిలియన్ డాలర్ల ఆమోదం తెలిపింది అని వరల్డ్ బ్యాంక్ ప్రెస్ రిలీజ్ పేర్కొంది. అమరావతిని ఆర్థిక కేంద్రంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చేసేందుకు భారత ప్రభుత్వం ఈ లోన్ కోరిందని ప్రపంచ బ్యాంకు తెలిపింది.

అమరావతిని ఆధునిక నగరంగా మార్చడానికి భారతదేశం ఈ నిధులను కోరింది. ఇక్కడి ప్రజలు, ముఖ్యంగా ఉపాథి కోసం చూసే వారికి ఉద్యోగాలను సృష్టించి, జీవన పరిస్థితులను మెరుగుపరుస్తుంది. ఈ లోన్ రెండు నిబంధనలతో ఉంటుంది. దీనికి 29 సంవత్సరాల రీపేమెంట్ వ్యవధి, ఆరు సంవత్సరాల గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. జపాన్ యెన్‌లో లోన్ తీసుకోవడానికి భారతదేశం సెలెక్ట్ చేసుకుంది. భారతదేశం ప్రపంచ బ్యాంకు కంట్రీ డైరెక్టర్ అగస్టే టానో కౌమే ఈ ప్రాజెక్ట్ భారతదేశ పట్టణాభివృద్ధికి అనుగుణంగా ఉందని, 2050 నాటికి దేశంలోని పట్టణ జనాభా 950 మిలియన్లకు చేరుతుందని అంచనా వేయగా పట్టాన నగరాల నిర్మాణానికి అమరావతి ఒక నమూనాగా ఉపయోగపడుతుంది అని అన్నారు.
ప్రస్తుతం, అమరావతి జనాభా దాదాపు 100,000, కానీ రాజధాని నగరం అభివృద్ధితో ఈ సంఖ్య వచ్చే దశాబ్దంలో వేగంగా పెరుగుతుందని అంచనా. ప్రభుత్వ ఈ మాస్టర్ ప్లాన్ ద్వారా 2050 నాటికి 3.5 మిలియన్ల నివాసితులకు వసతి కల్పించగల నగరంగా ఊహించారు. ఈ జనాభా పెరుగుదలకు భవిష్యత్తులో నివాసితుల అవసరాలను తీర్చే మౌలిక సదుపాయాలు, పట్టణ సౌకర్యాలు కల్పిస్తాయి. అమరావతి మొదటి దశ అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు మాత్రమే కాకుండా ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) కూడా ముందుకు వచ్చింది. ఈ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కలిసి అమరావతిని భారతదేశంలో స్థిరమైన పట్టణ వృద్ధికి నమూనాగా మారేల పునాది వేసేందుకు సహాయపడతాయి.


Click it and Unblock the Notifications