AP News: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలుత ఇంటరిమ్ బడ్జెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా 2024-25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం తన బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చేశారు. ఈ క్రమంలో రూ.2.94 లక్షల కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబడింది.
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం త్వరగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని ప్రతిపక్షాల నుంచి కూడా భారీగా డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలో ఒక్కొక్కటిగా ప్రభుత్వం నెరవేరుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ 'తల్లికి వందనం' పథకానికి నిధుల కేటాయింపును ప్రకటించింది. ఈ స్కీమ్ కింద కూటమి ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు అర్హులైన విద్యార్థుల తల్లులకు ఆ మెుత్తం అందించబడుతుంది. ఎన్నికల్లో ప్రభుత్వ హామీ ప్రకారం తల్లికి వందన స్కీమ్ కింద ఏడాదికి రూ.15 వేల చొప్పున ఎంత మంది పిల్లలు ఉంటే అందరికి అందిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇది విద్యార్థులకు చదువు భారం కాకుండా అండగా నిలుస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో పాఠశాల విద్యకు రూ.29,909 కోట్లు, ఉన్నత విద్యకు రూ.2,326 కోట్లను కేటాయించింది.

ఇదే క్రమంలో ఏపీ అసెంబ్లీలో మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నందున కూటమి ప్రభుత్వం దీనికి అగ్రస్థానాన్ని అందించింది. ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకంపై ప్రకటిస్తూ ఏటా రూ.20 వేలు అందించనున్నట్లు పేర్కొంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.6 వేల సాయం కూడా కలిపి ఉంటుందని చెబుతూ స్కీమ్ అమలు కోసం రూ.4,500 కోట్లను అలకేట్ చేసింది. రాష్ట్రంలోని భూమిలేని సాగుదారులందరికీ ఆర్థిక సహాయం సంవత్సరానికి రూ.20 వేల చొప్పున అందించనున్నట్లు వెల్లడించారు.
సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇటీవల దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ల స్కీమ్ అమలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామనే హామీలో మెుదటి సిలిండర్ కోసం 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.895 కోట్లను అందించింది. ఇప్పటికే 5 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు సబ్సిడీ మొత్తం అందింది.
ఇక సూపర్ సిక్స్ కింద ఇచ్చిన హామీల్లో కీలకమైనది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. రాష్ట్రంలో చాలా మంది ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందనే దానికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనిపై బడ్జెట్లో ప్రకటన చేస్తూ.. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ హామీని గడువులోగా అమలు చేస్తామన్నారు. అలాగే 2029 నాటికి అందరికీ ఇళ్లు ఉండేలా ప్రభుత్వం.. PMAY- NTR నగర్‌ల కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 25 లక్షల ఇళ్లు/ఇళ్ల పట్టాలను అందించాలని నిర్ణయిస్తూ రూ.4,012 కోట్లు కేటాయించారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications