AP News: సీఎం చంద్రబాబు పెట్టుబడుల వేట .. కేంద్రం నుంచి 2 పారిశ్రామిక స్మార్ట్ సిటీలు..
Chandrababu Naidu: ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేంద్రం నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం ఉన్న ఎటువంటి అవకాశాన్ని సైతం ఈ ప్రభుత్వం వదలటం లేదు. పైగా సీఎం చంద్రబాబు తెరవెనుక చర్చలు రాష్ట్రానికి అనేక పెట్టుబడులను రప్పించటంలో తోప్పడుతోందని తెలుస్తోంది.
తాజాగా నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీల ఏర్పాటుకు బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం రూ.28,602 కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. ప్రాజెక్టు ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. ప్రతిపాదిత 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీలు రూ.1.52 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి అవకాశాలను సృష్టిస్తాయి.

ఇప్పటికే ప్రతిపాదించిన 12 నగరాల్లో 8 నగరాలు వివిధ దశల్లో ఉన్నాయని డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. ఢోలేరా (గుజరాత్), ఔరిక్ (మహారాష్ట్ర), విక్రమ్ ఉద్యోగ్ పురి (మధ్యప్రదేశ్), కృష్ణపట్నం (ఆంధ్రప్రదేశ్)లాంటి నాలుగు నగరాల్లో ఇప్పటికే ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను కేటాయించినట్లు చెప్పారు. ఇక ఇండస్ట్రీల కోసం భూములు కేటాయించే పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. మిగతా నాలుగు నగరాల్లో కనీస వసతులు అయిన రోడ్ కనెక్టివిటీ, నీరు, విద్యుత్‌లను అందించే ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని కార్యదర్శి రాజేష్ కుమార్ చెప్పారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ ప్రాజెక్ట్ 9 రాష్ట్రాలలో విస్తరించి, 6 ప్రధాన కారిడార్‌లతో పాటు ప్రణాళిక చేయబడింది. ఈ పారిశ్రామిక ప్రాంతాలు ఉత్తరాఖండ్‌లోని ఖుర్పియా, పంజాబ్‌లోని రాజ్‌పురా-పాటియాలా, మహారాష్ట్రలోని డిఘి, కేరళలోని పాలక్కాడ్, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా-ప్రయాగ్‌రాజ్, బీహార్‌లోని గయా, తెలంగాణలోని జహీరాబాద్, ఆంధ్ర ప్రదేశ్‌లోని ఓర్వకల్-కోపర్తి, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్-పాలిలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications