భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ జంట ఓ ప్లాంట్ ఆధారిత మీట్ స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టారు. ఈ స్టార్టప్ ట్రైబ్ ఫుడ్స్. ఈ మేరకు అనుష్క శర్మ ఓ ప్రమోషనల్ వీడియోలో చెబుతారు. ఈ ప్రమోషనల్ వీడియోలో కోహ్లీ, అనుష్క ఉన్నారు. ఈ గ్రహాన్ని భవిష్యత్తు తరాలకు మంచి ప్రదేశంగా ఎలా మార్చగలమనే దానిపై నేను, విరాట్ తరుచూ మాట్లాడుకుంటామని, అందుకు తమ జీవితాల్లో మే మార్చుకున్న అంశాల్లో ఒకటి, మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవడమని, మాంసాన్ని అసలే తీసుకోకుండా ఉండడమని, ఆహార ప్రియులుగా తాము ఒక్కోసారి మాంసం రుచిని మిస్ అవుతున్నామని ఇద్దరు తమ డైట్ గురించి చెబుతున్నారు.
ముంబై కేంద్రంగా బ్లూ ట్రైబ్ ఫుడ్స్ అనే స్టార్టప్ వివిధ నగరాల్లో సేవలు అందిస్తోంది. సందీప్ సింగ్, నిక్కీ అరోరా సింగ్ దీనిని వ్యవస్థాపకులు. బాలీవుడ్ నటులు రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా గత ఏడాది తమ ప్లాంట్ బేస్డ్ మీట్ బ్రాండ్ ఇమాజిన్ మీట్స్‌ను ప్రారంభించారు. బియాండ్ మీట్ వంటి గ్లోబల్ బ్రాండ్స్ విజయాన్ని మార్కెట్‌లో ప్రతిబింబించాలని భావిస్తున్నారు.

ఇమాజిన్ మీట్స్ మాంసాహారం యొక్క తొమ్మిది రకాలను అందిస్తోంది. వీటిలో కీమాస్, సీక్ కబాబ్స్, బిర్యానీ వంటకాలు, నగ్గెట్స్, సాసెజ్‌లతో సహా మొక్కల ఆధారిత రకాలు సాన్స్ రియల్ మీట్ ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 25 నుండి 30 నగరాలకు తమ వ్యాపారాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జంతువుల పెంపకంతో ముడివడి ఉన్న కార్బన్ పుట్‌ప్రింట్‌ను తగ్గించే ఉద్దేశ్యంతో ఈ మాంసం కానీ మాంసానికి అంతర్జాతీయంగా డిమాండ్ పెరుగుతోంది. ఇమాజిన్ మీట్స్, వెజ్జీ చాంప్, గుడ్ డాట్ వంటి కంపెనీలు మొక్కల ఆధారిత మాంసాన్ని తీసుకు రావడంతో ఇక్కడా పుంజుకుంటోంది.


Click it and Unblock the Notifications