మోదీ సర్కార్ తెచ్చిన కొత్త టాక్స్.. పండుగ చేసుకుంటున్న స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు..!!
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం తాజాగా చైనా, దక్షిణ కొరియా, ఇండోనేషియా దేశాల నుంచి భారత్‌కు దిగుమతి చేసుకునే ఆప్టికల్ ఫైబర్‌పై భారీగా సుంకాన్ని విధించింది. ఇది స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఎలా జాక్ పాట్ అందించిందో ఇప్పుడు తెలుసుకుందాం..
తక్కువ నాణ్యత, ధర కలిగిన ఆప్టికల్ ఫైబర్ దిగుమతి కంపెనీలకు సైతం ఆర్థికంగా భారాన్ని మోపుతుంది. ఈ నష్టం నుంచి భారతీయ కంపెనీలను రక్షించడానికి, భారతదేశ వృద్ధికి బలమైన మార్గం వేయడానికి నాసిరకం ఆప్టికల్ ఫైబర్ దిగుమతులపై యాంటీ డంపింగ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం విధించటం జరిగింది. ఈ నిర్ణయం దేశీయంగా ఉన్న ఆప్టికల్ ఫైబర్ పరిశ్రమలోని కంపెనీలకు పెద్ద వ్యాపార అవకాశాన్ని అందించనుంది.

నాసిరకం ఉత్పత్తులపై విధించిన పన్ను కారణంగా దేశీయ కంపెనీలైన స్టెరిలైట్ టెక్నాలజీస్, బిర్లా కేబుల్‌లకు అనుకూలమైన వ్యాపార వాతావరణాన్ని సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చిన తర్వాత ఈ రెండు కంపెనీల షేర్లు సోమవారం భారీగా లాభపడ్డాయి. స్టెరిలైట్ టెక్నాలజీస్ కంపెనీ స్టాక్ 5 శాతానికి పైగా లాభపడగా, బిర్లా కేబుల్స్ స్టాక్ 20 శాతం మేర పెరిగింది. అయితే మంగళవారం మార్కెట్ల ప్రభావంతో కొంత నష్టంలో ట్రేడింగ్ ముగించాయి. అయితే దీర్ఘకాలంలో కంపెనీలకు మంచి ఆర్డర్లు, ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
కేంద్రం తీసుకొచ్చిన యాంటీ డంపింగ్ డ్యూటీ రానున్న ఐదు సంవత్సరాల పాటు అమలులో ఉండనుంది. అంటే దీర్ఘకాలంలో ఆప్టికల్ ఫైబర్ వ్యాపారంలో ఉండే కంపెనీలు మంచి పనితీరును నమోదు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది దేశీయ రిటైల్ ఇన్వెస్టర్లకు పెద్ద పెట్టుబడి అవకాశమని చెప్పుకోవచ్చు. సరైన కంపెనీని ఎంచుకోవటానికి ఇదే సరైన సమయం. అత్యంత వేగంగా డిజిటలీకరణ వైపుకు అడుగులు వేస్తున్న భారతదేశానికి కేంద్రం తీసుకున్న నిర్ణయం దీర్ఘకాలంలో ఖర్చులను తగ్గించేందుకు కంపెనీలకు తోడ్పడనుంది.


Click it and Unblock the Notifications