mutual funds misconceptions: దేశ ప్రజల్లో పెరిగిన ఆర్థిక అక్షరాస్యతకు నిలువెత్తున నిదర్శనమే మ్యూచువల్ ఫండ్స్‌లోకి విపరీతంగా పెరుగుతున్న ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పవచ్చు. సాంప్రదాయ పెట్టుబడి సాధనాలను వదిలిపెట్టి హై-రిటర్న్స్ ఇచ్చే వాటి వైపు ప్రజలు ఆకర్షితులవుతున్నారు. అయితే రిటర్నులతో పాటు అదే స్థాయిలో రిస్క్ ఉంటుందనే విషయాన్ని విస్మరిస్తున్నారు. దీనిని తగ్గించుకునేందుకు నిపుణులు సూచిస్తున్న డైవర్సిఫికేషన్ ను ఫాలో అయితే కొంత మేరకు సత్ఫలితాలను ఇస్తుంది.
కానీ ఇప్పటికీ మ్యూచువల్ ఫండ్ లపై సరైన అవగాహన లేకపోవడంతో వాటిలో ఇన్వెస్ట్ చేసేందుకు భయపడే వారు కూడా ఎందరో ఉన్నారు. ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తున్న ఫండ్ దివాళా తీస్తే తమ పరిస్థితి ఏమిటి అన్నది వారిలో ప్రముఖ ఆందోళనగా కనిపిస్తోంది. దీనికి కారణం వారికి ఆర్థిక మార్కెట్ల నిర్వహణ గురించిన అవగాహనా రాహిత్యమేనని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ లు ఆర్థిక మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అధీనంలో పనిచేస్తాయి. ప్రతి ఫండ్ హౌస్ దాని నియమ, నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.

కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ దివాళా తీయడం, పెట్టుబడిదారుల నగదు తీసుకొని పారిపోవడం వంటివి చేయడం కుదరదు. ఓ ఇన్వెస్టర్ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడిని పెట్టిన వెంటనే సదరు ఫండ్ హౌస్ కస్టమర్ పేరిట స్టాక్స్ కొనుగోలు చేసి తనుగుణంగా పోర్ట్‌ఫోలియోకు యాడ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇన్వెస్టర్ డబ్బు అటు ఫండ్ మేనేజర్ లేదా ఫండ్ హౌస్ చేతిలో ఉండదు. అది పూర్తిగా స్టాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. దీంతో ఆయా స్టాక్స్ విలువ పెరిగినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ రిటర్నులు పెరగడం, అవి తగ్గినప్పుడు తగ్గడం జరుగుతూ ఉంటాయి.
ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఓ ఇన్వెస్టర్ పెట్టుబడి పెడుతున్న ఫండ్ లేదా ఫండ్ హౌస్ దివాళా తీసే పక్షంలో సెబీ నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. ఇన్వెస్టర్ల సంపద ఏమాత్రం నష్టపోకుండా వారికి సెటిల్ చేసిన తర్వాతే ఈ విభాగం నుంచి బయటికి వెళ్ళవచ్చు. వేరే ఏదైనా కంపెనీ టేక్ ఓవర్ చేసిన పక్షంలో లేదా పూర్తిగా ఫండ్ హౌస్ బిజినెస్ నుంచి తప్పుకుంటుంటే తమ స్టాక్ హోల్డింగ్ను మార్కెట్లో విక్రయించి సదరు అమౌంట్‌ను కస్టమర్లకు చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా మ్యూచువల్ ఫండ్ హౌస్ లు దివాళా తీయడం వల్ల పెట్టుబడిదారులు నష్టపోవడం అనేది జరగే అవకాశం ఉండదని విశ్లేషకులు చెబుతున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications